News April 11, 2025
బిహార్‌లో వర్ష బీభత్సం.. 80 మంది మృతి

అకాల వర్షాల కారణంగా బిహార్‌లో 80 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర మంత్రి విజయ్ కుమార్ తెలిపారు. అకస్మాత్తుగా వచ్చిన భారీ వర్షాలు, పిడుగుల వల్ల ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. పంటలకు అపార నష్టం కలిగిందన్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టిందని, బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఇప్పటికే రూ.4లక్షల చొప్పున పరిహారం అందించామన్నారు.
Similar News
News November 17, 2025
‘శివ’ అంటే ఏంటో మీకు తెలుసా?

‘శివ’ అంటే మంగళం అని అర్థం. పరమ మంగళకరమైనది శివ స్వరూపం. ఆయనే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. ఆయన సర్వ వ్యాపకుడు. సర్వమునకు మూలకారణమైనవాడు. శివుణ్ణి నిరాకారుడిగా(రూపం లేనివాడిగా), సాకారుడిగా(రూపం ఉన్నవాడిగా) ఆరాధిస్తారు. శివుని సాకార స్వరూపమే లింగము. ఆ శివలింగం మనల్ని సగుణోపాసన నుంచి నిర్గుణోపాసన వైపునకు నడిపిస్తుంది. భక్తులకు మోక్ష మార్గాన్ని చూపి, ఉన్నత స్థాయికి చేరుస్తుంది.
News November 17, 2025
చలి తీవ్రత.. 10 జిల్లాలకు అలర్ట్!

TG: రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అత్యల్పంగా ఆసిఫాబాద్(D) సిర్పూర్‌లో 7.4 డిగ్రీలు నమోదయ్యాయి. రాబోయే 3రోజులు చలి తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, సంగారెడ్డి, ADB, వికారాబాద్, MDK, నిర్మల్, BPL, మంచిర్యాల, WGL, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఇతర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లో టెంపరేచర్లు 7-11 డిగ్రీల మధ్య నమోదవుతాయని చెప్పింది.
News November 17, 2025
బస్సులో నన్ను అసభ్యంగా తాకాడు: మంచు లక్ష్మి

తనకు 15 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులు ఎదురయ్యాయని మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘నేనెప్పుడూ సొంత వాహనంలోనే ప్రయాణించేదాన్ని. హాల్ టికెట్ల కోసం ఓసారి స్కూల్ యాజమాన్యం పబ్లిక్ బస్సులో తీసుకెళ్లింది. ఓ వ్యక్తి నన్ను అసభ్యంగా తాకడంతో షాకయ్యాను. సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చిన నాకే అలాంటి పరిస్థితి ఎదురైంది. బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఇలాంటివి ఎదుర్కొంటారు కానీ బయటకు చెప్పుకోలేరు’ అని తెలిపారు.


