News April 11, 2025
కొండగట్టు: హనుమాన్ జయంతి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

కొండగట్టు అంజన్న ఆలయంలో జరుగుతున్న చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల ఏర్పాట్లను కలెక్టర్ సత్యప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. ఆలయ అధికారులతో ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. మాల విరమణ కోసం అధిక సంఖ్యలో భక్తులు వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. స్నానమాచరించే కోనేరును పరిశీలించి ఎప్పటికప్పుడు నీరు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. భక్తులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని సూచించారు.
Similar News
News December 4, 2025
మన్యం: మెగా PTM ప్రజా వేదిక ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

భామినిలో గల ఏపీ ఆదర్శ పాఠశాల&కళాశాలలో రేపు జరగనున్న మెగా PTM ప్రజావేదిక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి గురువారం పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్న నేపథ్యంలో స్వయంగా కలెక్టర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి తప్పిదాలు జరగకుండా కార్యక్రమం విజయవంతం అయ్యేలా తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్లు ఉన్నారు.
News December 4, 2025
ప.గో: 594 కిలోల గంజాయి ధ్వంసం

పశ్చిమగోదావరి జిల్లాలోని వివిధ స్టేషన్లలో పట్టుబడ్డ గంజాయిని ధ్వంసం చేసినట్టు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గుంటూరు జిల్లా కొండవీడు పరిధిలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ వద్ద ఈ ప్రక్రియ నిర్వహించామన్నారు. మొత్తం 21 కేసులకు సంబంధించిన 594.844 కిలోల గంజాయిని ధ్వంసం చేసినట్టు ఎస్పీ వెల్లడించారు. ఈ ప్రక్రియకు సహకరించిన సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
News December 4, 2025
పుతిన్ పర్యటనతో భారత్‌కు లాభమేంటి?

* రెసిప్రోకల్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్(RELOS): ఈ ఒప్పందం ద్వారా భారత్‌కు సైనిక సహకారం, యుద్ధ నౌకలు, విమానాలకు లాజిస్టిక్ సపోర్ట్ దొరుకుతుంది. గగనతలాలను వాడుకోవడం సులభతరమవుతుంది.
* రష్యా న్యూక్లియర్ పవర్డ్ సబ్‌మెరైన్‌ను భారత్‌కు లీజుకు ఇవ్వనుంది. ఈ డీల్ విలువ $2 బిలియన్లు. దీనిద్వారా ఇండియా సముద్ర సరిహద్దులు మరింత బలోపేతమవుతాయి.


