News April 11, 2025
రేపే రిజల్ట్.. పార్వతీపురం జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ!

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో ఫస్టియర్ 8,968 మంది, సెకండియర్ 8,881 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలోని 34 కేంద్రాల్లో మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Similar News
News March 16, 2026
GDV: ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఖో-ఖో పోటీలకు రాజ్ కుమార్ ఎంపిక!

గుడివాడకి చెందిన క్రీడాకారుడు రాజ్ కుమార్ మరోసారి జాతీయస్థాయిలో మెరవనున్నారు. ఈనెల 19 నుంచి 22 వరకు మహారాష్ట్రలోని పూణే వేదికగా జరిగే ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఖో-ఖో టోర్నమెంట్‌కు ఆయన ఎంపికయ్యారు. AP జట్టు తరఫున రాజ్ కుమార్ ప్రాతినిధ్యం వహించడంపై AP ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. గతంలోనూ రాజ్ కుమార్ జాతీయ పోటీల్లో పతకాలు సాధించి రాష్ట్రానికి పేరు తెచ్చారని ఆయన కొనియాడారు.
News March 16, 2026
వినియోగదారుల చట్టాలపై అవగాహన ఉండాలి: జడ్జి

సంగారెడ్డి మండలం కులబ్‌గూర్‌లోని ఓ పాఠశాలలో సోమవారం వినియోగదారుల అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య మాట్లాడుతూ.. వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
News March 16, 2026
గిరిజన ఆర్గానిక్ ఉత్పత్తులకు భద్రగిరి మార్ట్‌లో ప్రత్యేక ప్యాకింగ్

శ్రీరామనవమి కంటే ముందుగా ప్రారంభించబోయే భద్రగిరి మార్ట్‌లో గిరిజన గ్రామాల్లో లభించే ఆర్గానిక్ నిత్యావసరాలను ప్రత్యేక ప్యాకింగ్‌తో విక్రయించాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ సూచించారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌హెచ్‌జీ మహిళలు, గిరిజనుల చిన్నతరహా పరిశ్రమల ద్వారా తయారయ్యే తృణధాన్యాలు, హస్తకళా వస్తువులు అందుబాటులో ఉంచాలని అన్నారు.


