News April 11, 2025
పదోన్నతి బాధ్యత మరింత పెంచుతుంది: ASF SP

పదోన్నతి ఉత్సాహంతో పాటు మరింత బాధ్యత పెరుగుతుందని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుల్స్‌గా విధులు నిర్వర్తిస్తూ ఆరుగురు హెడ్ కానిస్టేబుల్స్‌గా పదోన్నతి పొంది ఆసిఫాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీకి పుష్పగుచ్ఛం అందించి కలిశారు.
Similar News
News January 22, 2026
KMR: సమన్వయమే అసలైన సవాలు

కామారెడ్డి జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రస్తుతం తిరుగులేని జోరు ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలో అధికారంతో పాటు జిల్లా నేతలు ప్రభుత్వంలో ఉండటం పార్టీకి కొండంత బలాన్నిస్తోంది. బీఆర్ఎస్ నుంచి కీలక నేతల వలసలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. అయితే భారీ చేరికలే పార్టీకి కొత్త తల నొప్పులు తెచ్చేలా ఉన్నాయి. పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం కుదర్చడం ఇప్పుడు నాయకత్వానికి పెద్ద పరీక్షగా మారింది.
News January 22, 2026
MHBD: రిజర్వేషన్లు మారడంతో వార్డుల కోసం సెర్చింగ్..!

మహబూబాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో గతంలో పోటీ చేసి గెలిచిన స్థానాల్లో ఈసారి రిజర్వేషన్లు మారిపోయాయి. తాము పోటీచేయాలనుకున్న స్థానంలో అనుకూలమైన రిజర్వేషన్లు రాక పోవడంతో ఆశావహులు వేరే వార్డుల కోసం సెర్చ్ చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో ఛైర్మెన్ స్థానం మహిళలకు కేటాయించారు. ఎక్కువగా మహిళలకు వార్డు స్థానాలు ఉన్నాయి. అలాంటి చోట్ల తమ సతీమణులను బరిలో నిలిపేందుకు సిద్ధం అవుతున్నారు.
News January 22, 2026
ట్రంప్‌కు EU కౌంటర్.. ట్రేడ్ డీల్ ఫ్రీజ్

గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకోవాలన్న US అధ్యక్షుడు ట్రంప్ మొండి వైఖరికి EU కౌంటరిచ్చింది. యూరప్ దేశాలపై ఆయన సంధించిన టారిఫ్స్ అస్త్రాన్ని తిప్పికొట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. USతో ట్రేడ్ డీల్‌కు ఆమోదం తెలపకుండా EU పార్లమెంట్ ఫ్రీజ్ చేసింది. డీల్‌లో భాగంగా రానున్న రోజుల్లో అమెరికా వస్తువులపై టారిఫ్స్ ఎత్తేసేందుకు ఓటింగ్ జరపాల్సి ఉంది. కానీ ట్రేడ్ డీల్ నిలిపివేయడంతో ఓటింగ్ జరిగే పరిస్థితి లేదు.


