News April 11, 2025

వరంగల్ నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తాం: ఎంపీ కావ్య

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో వరంగల్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. మీడియాతో ఎంపీ మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి వరంగల్ నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.

Similar News

News January 17, 2026

వరంగల్: ఎన్నికల ముందు సీఐపై బదిలీ వేటు!

image

ఉమ్మడి WGLలోని ఓ CI బదిలీ వెనుక మతలబు ఉన్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఈ CI ఉంటే ఓడిపోతామనే కారణంతోనే బదిలీ చేయాలని సదరు ప్రజాప్రతినిధి ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. మొరం తరలింపులో భారీగా చేతులు మారిన వ్యవహారంలో ఆ అధికారి పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. అక్రమ కేసులను బనాయించి, ప్రజలను ఇబ్బంది పెట్టారని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీ నేత ప్రెస్ మీట్ పెట్టి మొత్తుకోవడం కూడా కారణమని సమాచారం.

News January 17, 2026

వైసీపీ మాజీ MP విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు

image

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 22న హైదరాబాద్ బషీరాబగ్‌లోని ఈడీ కార్యాలయంలో తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే విచారణ చేపట్టిన ఈడీ, పెద్ద ఎత్తున హవాలా లావాదేవీలు, మనీ లాండరింగ్ జరిగాయని ఆరోపిస్తోంది. ఈ కేసులో విజయసాయి రెడ్డిని విచారణకు పిలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

News January 17, 2026

KGHలో ఆన్‌లైన్ వైద్య సేవలు

image

ఇకపై KGHలో గంటల తరబడి ఓపీ, ఇతర వైద్య పరీక్షల కోసం వేచిచూడాల్సిన అవసరం లేదు. ఈ సమస్యలకు చెక్ పెట్టే దిశగా ఈ-పాలన విధానాన్ని KGH అమలు చేయనుంది. రోగులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వైద్య సేవలను ఆన్‌లైన్ విధానంలో అందించడమే లక్ష్యంగా ఈ కొత్త వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు KGH అధికారులు తెలిపారు.