News April 11, 2025
GDK: గతంలో తల్లి కిడ్నీ దానం చేసింది… అయినా దక్కని ప్రాణాలు

గోదావరిఖని రాంనగర్ కు చెందిన జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు నీలం ఐలయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఈరోజు మరణించారు. ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గత కొంతకాలం క్రితం ఐలయ్యకు తల్లి ఒక కిడ్నీ దానం చేశారు. కొంతకాలం ఆరోగ్యంగా ఉన్న ఐలయ్య ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఐలయ్య మరణించడం పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.
Similar News
News April 19, 2025
MHBD: దరఖాస్తుల ఆహ్వానం

2025-26 ఏడాదికి కార్పొరేట్ కళాశాలల ప్రవేశ పథకంలో భాగంగా ఉత్తమ కళాశాలలను ఎంపిక చేయడానికి జిల్లాలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి అధికారి నరసింహస్వామి తెలిపారు. కళాశాలల దరఖాస్తులను epass.telangana.gov.inలో ఈ నెల 30 లోపు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
News April 19, 2025
ట్రంప్ వద్దంటున్నా.. ఇరాన్‌పై దాడికే ఇజ్రాయెల్ మొగ్గు

ఇరాన్‌పై దాడి వద్దని ఓవైపు అమెరికా వారిస్తున్నా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. వచ్చే నెలల్లో ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసే అవకాశం ఉందని ఆ దేశ అధికారులు తెలిపారు. ఇరాన్‌కు అణ్వస్త్ర సామర్థ్యం ఉండొద్దనేదే తమ లక్ష్యమని వివరించారు. అటు ట్రంప్ ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేయకుండా ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌ను దాడి చేయొద్దని వారిస్తున్నట్లు తెలుస్తోంది.
News April 19, 2025
చీపురు పట్టి శుభ్రం చేసిన అనకాపల్లి ఎస్పీ

స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి పోలీస్ కార్యాలయం ఆవరణలో శనివారం శ్రమదానంతో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి శుభ్రం చేశారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా స్వయంగా చీపురు పట్టి కార్యాలయం ప్రాంగణంలో శుభ్రం చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. స్వచ్ఛతే ఆరోగ్యానికి నాందిగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.