News April 11, 2025
రేపే రిజల్ట్.. సత్యసాయి జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ!

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో ఫస్టియర్ 13,083, సెకండియర్ 10,904 మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Similar News
News November 17, 2025
HYD: ఆ పోస్ట్ అప్పుడే తొలగించాం: సీవీ ఆనంద్

నటుడు బాలకృష్ణపై సీవీ ఆనంద్ పెట్టిన ఓ ఎమోజీ వివాదాస్పదమైంది. దీనిపై బాలయ్య ఫ్యాన్స్ నుంచి విమర్శలు రావడంతో సీవీ ఆనంద్ స్పందించారు. దాదాపు 2 నెలల క్రితం తన సోషల్ మీడియాను నిర్వహించే వ్యక్తి ఆ పోస్ట్ చేశారని చెప్పారు. వెంటనే ఆ పోస్ట్‌ను తొలగించి, బాలకృష్ణకు క్షమాపణలు చెప్పానని స్పష్టంచేశారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని ట్వీట్ చేశారు.
News November 17, 2025
చిత్తూరు జిల్లా దివ్యాంగులకు గమనిక

చిత్తూరు జిల్లాలో దివ్యాంగులు, వయోవృద్ధులకు సహాయ పరికరాల గుర్తింపు శిబిరాలు ఈనెల 19వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఏపీ వికలాంగుల సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 19న చిత్తూరు, 20న కార్వేటినగరం, 21న ఐరాల, 22న నగరి, 23న సదుంలో శిబిరాలు ఉంటాయన్నారు.
News November 17, 2025
బిహార్ ‘మహాగురు’.. MLAగా గెలవలేకపోయారు!

బిహార్ ఎన్నికల్లో ఉన్నత విద్యావంతుడు, టాప్ మ్యాథమెటీషియన్ కృష్ణ చంద్ర సిన్హా ఓడిపోవడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ స్థాపించిన JSP నుంచి పోటీ చేసిన ఈయనకు కేవలం 15వేల ఓట్లే వచ్చాయి. ఈయన బీఎస్సీ, ఎంఎస్సీలో డబుల్ గోల్డ్ మెడల్స్ సాధించారు. PhD పూర్తి చేశారు. గణితంపై 70 పుస్తకాలు రాశారు. బిహార్‌లో ఈయనను మహాగురు అని పిలుస్తారు. అయినా రాజకీయాల్లో రాణించలేకపోయారు.


