News April 11, 2025
టీవీల్లోకి బ్లాక్ బస్టర్ సినిమా

అల్లు అర్జున్ ‘పుష్ప-2’ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈనెల 13, 14 తేదీల్లో దక్షిణాది భాషల్లో ప్రసారం కానుంది. ఈనెల 13న తెలుగులో స్టార్ మా (5.30pm), మలయాళంలో ఆసియా నెట్ (6.30pm), కన్నడలో కలర్స్ కన్నడ (7pm), 14న తమిళంలో స్టార్ విజయ్ (3pm) టీవీ ఛానల్‌లో రానుంది. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1800కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే.
Similar News
News November 17, 2025
రాజకీయ కుటుంబాల్లో ఇంటిపోరు.. పార్టీల కుదేలు

రాజకీయాల్లో అవకాశాల కోసం ఆడబిడ్డల పోరు పొలిటికల్ ఫ్యామిలీలలో చిచ్చు పెడుతోంది. APలో జగన్ సోదరి షర్మిల, TGలో KTR చెల్లెలు కవిత బాటలోనే బిహార్‌లో తేజస్వి సోదరి రోహిణి బంధాలను తెంచుకున్నారు. ఇంటి పోరుతో ఆయా పార్టీలు కుదేలవుతున్నాయి. ఎన్నికలకు ముందు షర్మిల వేరుకుంపటి పెట్టుకోగా, ఎన్నికల తర్వాత కవిత, రోహిణి తమ బాధను వెళ్లగక్కారు. రానున్న రోజుల్లో ఈ గొడవలకు ముగింపు దొరుకుతుందా? వేచిచూడాల్సిందే.
News November 17, 2025
సౌదీలో ఘోర ప్రమాదం.. 42 మంది మృతి

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్కాలో ప్రార్థనలు ముగించుకుని మదీనాకు వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి 42 మంది యాత్రికులు సజీవదహనమయ్యారు. ఇందులో 20 మంది మహిళలు, 11 మంది పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లు నేషనల్ మీడియా తెలిపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ముఫరహత్ వద్ద ఈ యాక్సిడెంట్ జరిగింది.
News November 17, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* కడప జిల్లాలోని పుష్పగిరిలో 13వ శతాబ్దానికి చెందిన శాసనాలను పురావస్తు శాఖ గుర్తించింది.
* కల్తీ నెయ్యి కేసులో నిందితుడైన A24 చిన్న అప్పన్నను నేటి నుంచి 5 రోజులపాటు సిట్ విచారించనుంది. ఇదే కేసులో TTD మాజీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డి ఈ నెల 19/20న విచారణకు హాజరుకానున్నారు.
* TTD మాజీ ఏవీఎస్‌వో సతీశ్ మృతి కేసును గుత్తి రైల్వే పోలీసుల నుంచి తాడిపత్రి పోలీసులకు బదిలీ చేయాలని అధికారులు నిర్ణయించారు.


