News April 11, 2025

క్రికెట్‌లో త్వరలో కొత్త రూల్స్!

image

కొత్త రూల్స్ తీసుకొచ్చేందుకు ICC కసరత్తు చేస్తోంది. వన్డేల్లో రెండు కొత్త బంతుల రూల్‌ను సవరించనుంది. దీని ప్రకారం బౌలింగ్ టీమ్ 2 న్యూ బాల్స్‌తో ఆటను ఆరంభించవచ్చు. 25 ఓవర్ల తర్వాత వాటిలో ఒక్క దానినే కొనసాగించాల్సి ఉంటుంది. అలాగే టెస్టుల్లో ఒక్క రోజులో 90 ఓవర్లు పూర్తయ్యేలా ఓవర్ల మధ్య 60sec మాత్రమే విరామం ఉండేలా టైమర్‌ను తీసుకురానుంది. అటు మెన్స్ U19 WCను T20 ఫార్మాట్‌కు మార్చాలని యోచిస్తోంది.

Similar News

News January 29, 2026

కామారెడ్డి: మీడియా సెంటర్ ను ప్రారంభించిన అదనపు కలెక్టర్లు

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ కేంద్రాన్ని గురువారం అదనపు కలెక్టర్ మధుమోహన్, విక్టర్ ప్రారంభించారు. రోజువారీ వివిధ దినపత్రికలు, ఛానళ్లలో ప్రసారమయ్యే పెయిడ్ న్యూస్‌ను గుర్తించి వాటిని సంబంధిత రిజిస్టర్లలో నమోదు చేయాలని సూచించారు.

News January 29, 2026

నేతన్నలకు శుభవార్త.. ఏప్రిల్ 1 నుంచి కొత్త స్కీమ్

image

AP: మగ్గాలకు ఉచిత విద్యుత్ అమలు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ఈ స్కీమ్ అమలు చేయాలని నిర్ణయించింది. హ్యాండ్లూమ్‌ (మగ్గం)కు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల ఫ్రీ కరెంట్ ద్వారా 4 లక్షల మందికి లాభం కలుగుతుందని మంత్రి సవిత తెలిపారు. దీనివల్ల నెలకు రూ.85 కోట్ల మేర ప్రభుత్వంపై భారం పడుతుందన్నారు. 50 ఏళ్లకే నేతన్నలకు రూ.4 వేల పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు.

News January 29, 2026

చామంతి మొక్కల తలల కత్తిరింపుల వల్ల లాభమేంటి?

image

చామంతి సాగులో అధిక దిగుబడి రావాలంటే మొక్కల తలల కత్తిరింపు తప్పక చేపట్టాలి. పొలంలో మొక్కలన్నీ 30 సెంటీమీటర్లు దాకా పెరిగిన తర్వాత వాటి తలలను తుంచేయాలి. దీని వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి. ఫలితంగా పూల దిగుబడి కూడా పెరుగుతుంది. మొక్కల తలలను తుంచాక నిపుణుల సూచనలతో నత్రజని, పొటాష్ ఎరువులను తగిన మోతాదులో అందిస్తే నాణ్యమైన పువ్వులను పొందవచ్చు.