News April 11, 2025

వనపర్తి: ‘ఫులే ఆశయ సాధన కోసం కృషి చేయాలి’

image

బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడు మహాత్మ జ్యోతిబాఫులే అని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేద్దామని మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఫులే జయంతి వేడుకలను హైదరాబాదులోని తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఫులే చిత్రపటానికి రావుల పూలమాల వేసి నివాళులర్పించారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్, కిషోర్, తుంగ బాలు, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 6, 2025

చిలకలూరిపేట: మాజీ మంత్రి పీఏలపై కేసు నమోదు

image

ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి కొంతమంది వ్యక్తుల వద్ద డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలపై మాజీ మంత్రి విడదల రజిని పీఏలైన రామకృష్ణ, శ్రీకాంత్ రెడ్డి, శ్రీగణేశ్, కుమారస్వామిలపై చిలకలూరిపేట రూరల్ PSలో కేసు నమోదు అయింది. గత సోమవారం పట్టణానికి చెందిన ఎస్ఎంఎస్ సుభాని, తన్నీరు వెంకటేశ్వర్లు ఎస్పీకి ఫిర్యాదు చేయగా, వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అనిల్ తెలిపారు.

News November 6, 2025

కౌడిపల్లి: కోళ్ల వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి

image

కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వెంకట్రావుపేట్ గ్రామానికి చెందిన కొన్యాల దత్తయ్య(57) నడిచి వెళ్తుండగా.. రాంగ్‌రూట్‌లో వచ్చిన కోళ్ల వ్యాన్ ఢీకొట్టింది. స్థానికులు వెంటనే దత్తయ్యను అంబులెన్స్ వాహనంలో హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 6, 2025

నాగర్ కర్నూల్: ఈనెల 15న లోక్ అదాలత్

image

నాగర్ కర్నూల్ జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో కేసుల పరిష్కారానికి ఈనెల 15‌వ తేదీన ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రెటరీ నసీమ సుల్తానా తెలిపారు. పోలీసు అధికారులు వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీ అయ్యే విధంగా చూడాలన్నారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారంతో అప్పీల్ లేని తీర్పును పొందవచ్చన్నారు.