News April 11, 2025

హనుమాన్ జయంతి..భద్రతా చర్యలపై SP సమీక్ష

image

హనుమాన్ జయంతి వేడుకలను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. శుక్రవారం ఆయన స్వయంగా రంగంలోకి దిగి, ఆయా శాఖల అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా సమీక్షించారు. అనంతరం కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో ర్యాలీ నిర్వహించే ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, పలు సూచనలు చేశారు. వెంట ఏఎస్పీ చైతన్య రెడ్డి ఉన్నారు.

Similar News

News September 15, 2025

చింతలపూడి: కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తల్లి మృతి

image

కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తల్లి మృతి చెందిన ఘటన చింతలపూడి మండలం గురుభట్లగూడెంలో చోటుచేసుకుంది. కుమారుడు చక్రపు వాసు నిన్న అనారోగ్యంతో మృతి చెందడంతో 90 ఏళ్ల చక్రపు శాంతమ్మ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ విషాదాన్ని భరించలేక సోమవారం ఆమె కూడా తుదిశ్వాస విడిచారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

News September 15, 2025

NLG: దసరా వస్తోంది.. జీతాలేవీ..?

image

NLG జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులకు రెండు నెలలుగా ఎదురుచూపులు తప్పడం లేదు. గ్రామాలు స్వచ్ఛంగా ఉంచే బాధ్యతను తమపై వేసుకుని జిల్లాలో 868 జీపీల్లో పనిచేసే కార్మికుల బతుకులు దుర్భరంగా మారుతున్నాయి. తక్కువ జీతం సైతం సకాలంలో రాక కుటుంబ పోషణకు అప్పులు చేస్తున్నారు. బతుకమ్మ, దసరా పండుగ సమీపిస్తుండడంతో నూతన వస్త్రాలు, ఇతర సామగ్రి కొనుగోలు చేద్దామంటే చేతిలో డబ్బులు లేక దిక్కులు చూస్తున్నారు.

News September 15, 2025

కాణిపాకంలో రేపు లడ్డూ వేలంపాట

image

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి మహాప్రసాదం లడ్డూకు బహిరంగంగా వేలం నిర్వహిస్తున్నట్లు ఈవో పెంచల కిశోర్ తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం తెప్పోత్సవాలను నిర్వహించనున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు రేపు 21వ రోజు కావడంతో 21 కేజీల లడ్డూను తెప్పోత్సవం ముగిసిన తర్వాత కోనేరు ఎదుట వేలం వేయనున్నారు.