News April 11, 2025

దామెర: వడదెబ్బతో తాపీ మేస్త్రి మృతి

image

హన్మకొండ జిల్లా దామెర మండలంలో విషాదం చోటుచేసుకుంది. వడదెబ్బతో తాపీ మేస్త్రీ మల్లేశం(46) మృతి చెందారు. ఓ ఇంటి దాబాపై పనిచేస్తున్న క్రమంలో వడదెబ్బ తగిలి మృతి చెందాడని మల్లేశం భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు SI అశోక్ తెలిపారు. వేసవి దృష్ట్యా కార్మికులు పనిచేసే ప్రదేశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని SI సూచించారు.                                                    

Similar News

News September 16, 2025

సంగారెడ్డి: ‘శారీరక వైకల్యం విద్యార్థుల ప్రొఫార్మా సమర్పించాలి’

image

జిల్లాలోని అన్ని పాఠశాలల్లో చదువుతున్న శారీరక వైకల్యం ఉన్న విద్యార్థుల ప్రొఫార్మా-I ను సమర్పించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్ల తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. శారీరక వైకల్యం ఉన్న విద్యార్థుల PH సర్టిఫికెట్లను డీఈవో కార్యాలయంలో సమర్పించాలన్నారు. మార్చి 2026లో జరిగే రెగ్యులర్ SSC పబ్లిక్ పరీక్షలకు CWSN అభ్యర్థులకు మినహాయింపులు ఇవ్వనున్నట్టు తెలిపారు.

News September 16, 2025

ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి

image

తెలంగాణలో నలుగురు IAS అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. NVS రెడ్డిని HMRL ఎండీ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. ఆయనను ప్రభుత్వ పట్టణ రవాణా సలహాదారుడిగా నియమించింది. రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్‌‌కు అదనపు బాధ్యతలు ఇచ్చింది. HMDA సెక్రటరీగా శ్రీవాత్సవ, SC గురుకులాల కార్యదర్శిగా కృష్ణ ఆదిత్యలకు అదనపు బాధ్యతలిస్తూ నిర్ణయించింది. పూర్తి వివరాలకు <>క్లిక్<<>> చేయండి.

News September 16, 2025

వనపర్తి: పోక్సో చట్టంపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

ఉపాధ్యాయులు విద్యార్థులకు పోక్సో చట్టంపై నిరంతరం అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో ఎస్పీ గిరిధర్‌తో కలిసి ఉపాధ్యాయులకు ఈ చట్టంపై అవగాహన కల్పించారు. సమాజంలో చిన్నారులపై నేరాలను అరికట్టడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యమని కలెక్టర్, ఎస్పీలు తెలిపారు. విద్యార్థులకు ఈ చట్టం గురించి బోధించాలని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.