News April 11, 2025
వరంగల్ గ్రేన్ మార్కెట్లో ధరలు ఇలా..!

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పలు సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. టమాటా మిర్చి క్వింటాకు నిన్న ధర రూ.28,500 పలకగా.. నేడు రూ.27వేలకు పడిపోయింది. అలాగే దీపిక మిర్చి క్వింటా ధర నిన్న రూ.12,500 పలకగా.. ఈరోజు కూడా అదే ధర పలికింది. 5531 మిర్చికి కూడా నేడు రూ.9,500 ధర వచ్చింది. సింగిల్ పట్టీకి రూ.23వేలు వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.
Similar News
News September 9, 2025
వరంగల్: 136 ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్

జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద జిల్లా ప్రజల నుంచి 136 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ సమస్యలు 60, జీడబ్ల్యూఎంసీ 21, విద్యాశాఖ 11, సహకార శాఖ 9, గృహ నిర్మాణ శాఖ 7, ఇతర శాఖలకు 28 ఫిర్యాదులు వచ్చాయి. ప్రతి ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
News September 8, 2025
వరంగల్: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల వినతుల స్వీకరణ

వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలపై వినతులను కలెక్టర్కు నేరుగా అందజేశారు. డాక్టర్ సత్య శారద ప్రతి వినతిని ఓర్పుతో స్వీకరించి, సంబంధిత అధికారులకు వెంటనే సూచనలు చేశారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ స్పష్టం చేశారు.
News September 8, 2025
వరంగల్: ‘తుది ఓటరు జాబితా రూపకల్పనలో సహకరించాలి’

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద నేతృత్వంలో ఈరోజు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితా రూపకల్పనలో ప్రతి పార్టీ సమన్వయం చేసి సహకరించాలని కలెక్టర్ కోరారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా సాగేందుకు ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె సూచించారు.