News April 11, 2025
గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన SP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శుక్రవారం ఓడరేవులో పర్యటించారు. ఎస్పీ తుషార్ డూడి గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలోని పరిస్థితులు శాంతిభద్రతలపై గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఎస్పీ వివరించారు.
Similar News
News April 18, 2026
మరో ఆపరేషన్ సిందూర్‌కు గెట్ రెడీ: సీడీఎస్

ఆపరేషన్ సిందూర్ నెక్స్ట్ ఫేజ్‌కు భారత దళాలు సిద్ధంగా ఉండాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పిలుపునిచ్చారు. రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలన్నారు. త్రివిధ దళాల మధ్య సమన్వయం ఇంకా మెరుగవ్వాలని సూచించారు. ఆపరేషన్స్‌లో పైచేయి సాధించేందుకు ఆర్మీ సమాచార సేకరణపై దృష్టిపెట్టిందన్నారు. OPSకు త్వరలో ఏడాది (మే 7) పూర్తికానున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
News April 18, 2026
ఖమ్మం: వ్యవసాయ వ్యర్థాలతో ‘బయో గ్యాస్’ ఉత్పత్తి

ఖమ్మం జిల్లాలో వ్యవసాయ వ్యర్థాల నుంచి ఇంధన తయారీకి మార్గం సుగమమైంది. సాగులో మిగిలే పత్తి, మిరప కట్టెలు, మొక్కజొన్న చొప్పతో ‘కంప్రెస్డ్ బయోగ్యాస్’ ఉత్పత్తికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రోజుకు 15 టన్నుల సామర్థ్యంతో జీపీఎస్ రెన్యువబుల్ సంస్థ ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం స్థల సేకరణ కోసం సర్వే కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు రైతులకు అదనపు ఆదాయం లభించనుంది.
News April 18, 2026
ఒంగోలు: రూ.1.20 కోట్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ అందజేత

ఒంగోలులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ కింద రూ.1.20కోట్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ వేగంగా పరిష్కరించింది. ప్రమాదంలో మరణించిన ఏపీ సచివాలయం ఉద్యోగి పోధిలి భార్గవనాథ్ కుటుంబానికి జిల్లా కలెక్టర్ రాజాబాబు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే పథకమని తెలిపారు.


