News April 11, 2025
నల్గొండ: ‘తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు’

హనుమాన్ జయంతి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. శోభ యాత్ర నిర్వహించే సమయంలో ఇతర మతాల వారి మనోభావాలను కించపరిచే నినాదాలు చేయరాదన్నారు. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు, తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పరిదిలో డీజేలకు అనుమతి లేదని పోలీసువారి నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News July 7, 2025
NLG: సగం అంగన్వాడీ కేంద్రాలకే సొంత భవనాలు!

జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు అరకొర సౌకర్యాలతోనే నడుస్తున్నాయి. సగం కేంద్రాలకు సొంత భవనాలు లేవు. కొన్ని చోట్ల మంజూరైనా నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. చిన్నారులకు పౌష్టికాహారం, గర్భిణీలు, బాలింతలకు ఆరోగ్య సేవలు అందించే ఈ కేంద్రాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఇక అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక కొందరు తల్లిదండ్రులు తమ చిన్నారులను ఆయా కేంద్రాలకు పంపించడం లేదు.
News July 7, 2025
నల్గొండ జిల్లాలో 5వేలకు పైగానే రేషన్ కార్డులు కట్!

జిల్లాలో రేషన్ కార్డుల్లో అనర్హుల ఏరివేతకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వరుసగా ఆరు నెలలపాటు బియ్యం తీసుకొని కార్డులు రద్దు కానున్నట్లు సమాచారం. జిల్లాలో ప్రస్తుతం 4,78,216 రేషన్ కార్డులు ఉన్నాయి. కాగా జిల్లాలో 5,092 కార్డుదారులు ఆరు మాసాల నుంచి బియ్యం తీసుకోవడం లేదని తేల్చి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో వారిని అనర్హులుగా ప్రకటించి కార్డులు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
News July 7, 2025
NLG: ఉచిత శిక్షణ దరఖాస్తులకు నేడే ఆఖరు

ఎస్సీ, స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికిగాను సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి బి. శశికళ తెలిపారు. డిగ్రీ ఉతీర్ణులైన SC, ST, BC (BCE, PWD) కులాలకు చెందిన ఆసక్తి గల అభ్యర్థులు www.tsstudycircle.co.in వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 7లోగా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. 13న రాత పరీక్ష ఉంటుందన్నారు.