News April 11, 2025

రేపు ఉ.11 గంటలకు..

image

AP: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు రేపు ఉ.11 గం.కు విడుదల కాబోతున్నాయి. రిజల్ట్స్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు మీకెంతో ఇష్టమైన Way2News యాప్ ద్వారా వేగంగా తెలుసుకోవచ్చు. కేవలం హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే క్షణాల్లో డీటెయిల్డ్ మార్క్స్ లిస్ట్ మీ ముందుంటుంది. ఎలాంటి యాడ్స్ ఉండవు. మీ ఫలితాలను ఒక్క క్లిక్కుతో షేర్ చేసుకోవచ్చు.
*విద్యార్థులకు Way2News తరఫున BEST OF LUCK

Similar News

News January 17, 2026

మెదడు ఇచ్చే ముందస్తు సంకేతం.. నెగ్లెక్ట్ చేయొద్దన్న వైద్యులు!

image

మెదడుకు రక్తప్రసరణ తాత్కాలికంగా నిలిచిపోవడాన్ని ‘మినీ స్ట్రోక్’ అంటారు. ఇది భవిష్యత్తులో రాబోయే భారీ స్ట్రోక్‌కు ముందస్తు హెచ్చరిక లాంటిదని ప్రముఖ వైద్యుడు సుధీర్ కుమార్ హెచ్చరించారు. మాట తడబడటం, కంటిచూపు మందగించడం వంటి లక్షణాలు నిమిషాల్లో తగ్గిపోయినా వాటిని నిర్లక్ష్యం చేయకూడదని తెలిపారు. ఇవి కనిపిస్తే వెంటనే వైద్యుడిని కలవడం ద్వారా 80% వరకు మేజర్ స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించవచ్చని సూచించారు.

News January 17, 2026

లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు

image

AP: లిక్కర్ స్కాం కేసులో YCP మాజీ MP విజయసాయిరెడ్డికి ED నోటీసులిచ్చింది. ఈ నెల 22న తమ ఎదుట హాజరుకావాలని పేర్కొంది. YCP హయాంలో అమలు చేసిన మద్యం విధానంలో అక్రమాలు జరిగాయని ED విచారణ జరుపుతోంది. ఆ టైమ్‌లో జగన్‌కు సన్నిహితంగా ఉన్న VSRకి నోటీసులివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. మద్యం సరఫరాదారులు, డిస్టిలరీల నుంచి ముడుపులు అందినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి.

News January 17, 2026

ఇంటి చిట్కాలు

image

* జిడ్డు పట్టిన గ్యాస్ లైటర్‌ను ఒక క్లాత్‌పై కాస్త లైజాల్, నిమ్మకాయ, బేకింగ్ సోడాతో తుడిస్తే గ్యాస్ లైటర్ మెరిసిపోతుంది.
* నెయిల్ పాలిష్ క్లీనర్‌తో తుడిస్తే ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులపై మరకలు పోతాయి.
* ఒక కప్పు వేడి నీటిలో 2 చెంచాల వెనిగర్‌ వేసి బాగా కలిపి, వాషింగ్ మెషీన్ మరకలపై స్ప్రే చేసి కాసేపు అలాగే ఉంచాలి. తర్వాత క్లీనింగ్ బ్రష్‌తో శుభ్రం చేస్తే మరకలు ఈజీగా తొలగిపోతాయి.