News March 27, 2024

గుంటూరు పశ్చిమ ఇండియా కూటమి అభ్యర్థిగా అజయ్ 

image

గుంటూరు పశ్చిమ ఇండియా కూటమి అభ్యర్థిగా CPI జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు గుంటూరులోని CPI కార్యాలయంలో కూటమి సభ్యులు సమావేశం నిర్వహించి అజయ్ కుమార్‌ను ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన్ను సత్కరించి అభినందనలు తెలిపారు. అజయ్ కుమార్ మాట్లాడుతూ.. కార్మిక, రైతు, పేద, బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

Similar News

News March 7, 2026

ఈనెల 13 లోగా అభ్యంతరాలు తెలపాలి: లింగేశ్వర్ రెడ్డి

image

జోన్-III పరిధిలోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలోని స్కూల్ అసిస్టెంట్ గేడ్-II ప్రధానోపాధ్యాయ పోస్టులకు, తాత్కాలిక సీనియారిటీ జాబితా విడుదల చేశారు. వివరాలను వెబ్ సైట్‌లో అందుబాటులో
ఉంచినట్లు ఆర్జేడీ లింగేశ్వర్ రెడ్డి తెలిపారు. సీనియారిటీ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత డీఈవో కార్యాలయంలో తగిన ఆధారాలతో ఈనెల 13వ తేదీలోగా అందజేయాలని సూచించారు.

News March 7, 2026

గుంటూరు: రేపు గురుకులాల్లో ఖాళీ సీట్లకు ప్రవేశ పరీక్ష

image

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లా కోఆర్డినేటర్ శ్రీదేవి ఈ విషయాన్ని వెల్లడించారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ పరీక్ష ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి 11.30 వరకు 6, 7 తరగతుల అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3.30 వరకు 8, 9, 10 తరగతుల విద్యార్థులకు పరీక్ష జరుగుతుందని తెలిపారు.

News March 7, 2026

గుంటూరు: మిర్చి యార్డుకు సరకు రాకల్లో హెచ్చుతగ్గులు

image

గుంటూరు మిర్చి యార్డుకు వచ్చే టిక్కీల సంఖ్యలో మార్పులు కనిపిస్తున్నాయి. రెండు రోజులు లక్షా 25 వేల వరకు టిక్కీలు వచ్చినా శుక్రవారం సుమారు 88 వేలకే పరిమితమయ్యాయి. ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ ఈ తగ్గుదలకు స్పష్టమైన కారణం లేదు. హోలీ కారణంగా ఈ వారంలో నాలుగు రోజులు మాత్రమే లావాదేవీలు జరిగాయి. సోమవారం 1,04,740 టిక్కీలు రాగా తరువాత రోజుల్లో సంఖ్య పెరిగింది. ప్రస్తుతం యార్డులో 26 వేల మిర్చి బస్తాలు ఉన్నాయి.