News April 11, 2025
కన్నుల పండువగా రాములోరి కళ్యాణం

ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. లక్షలాది భక్తులు తరలిరాగా మంగళవాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా అర్చకులు కళ్యాణం నిర్వహించారు. ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించి భక్త జనం పులకించిపోయారు.
Similar News
News July 10, 2025
ఇంగ్లండ్ నాలుగు వికెట్లు డౌన్

లార్డ్స్‌లో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. టీ బ్రేక్ తర్వాత తొలి బంతికే పోప్‌ను జడేజా ఔట్ చేశారు. ఆ తర్వాత హ్యారీ బ్రూక్‌ను బుమ్రా బౌల్డ్ చేశారు. ప్రస్తుతం క్రీజులో రూట్(62*), కెప్టెన్ స్టోక్స్(0*) ఉన్నారు. ఇంగ్లండ్ స్కోర్ 172/4గా ఉంది.
News July 10, 2025
నంద్యాలలో ఈనెల 20న రాష్ట్రస్థాయి ర్యాంకింగ్ టెస్ట్ టోర్నమెంట్

ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాలలో ఈనెల 20న రాష్ట్రస్థాయి ర్యాంకింగ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా సంఘం ఛైర్మన్ రామకృష్ణారెడ్డి, అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ గురువారం తెలిపారు. ఈ మేరకు కరపత్రాలను విడుదల చేశారు. ఈ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన వారు జాతీయస్థాయి టోర్నమెంట్‌లో పాల్గొంటారని పేర్కొన్నారు. www.apchess.org వెబ్ సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.
News July 10, 2025
కైలాసగిరిపై కొత్త ‘రోప్ వే’ ప్రాజెక్టు

కైలాసగిరిపై కొత్త ‘రోప్ వే’ను V.M.R.D.A. నిర్మించనుంది. ప్రస్తుత రోప్ వే పాతబడింది. ప్రయాణ వ్యవధి తక్కువ. దీంతో కొత్త దారిలో ‘రోప్ వే’ను ప్రతిపాదించామని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. దీని ద్వారా బే ఫ్రంట్, విశాఖ నగరం, కొండల దృశ్యాలను త్రీ డైమెన్షనల్ వ్యూలో చూడొచ్చు. సుమారు 1.5 కిలోమీటర్ల పొడవైన ప్రయాణం ఉంటుంది. కార్ పార్కింగ్, ఇతర దర్శనీయ స్థలాలను ఈ రోప్ వే అనుసంధానం చేస్తుంది.