News April 11, 2025
కృష్ణా: 15 నుంచి సముద్రంలో వేట నిషేధం

సముద్రంలో మత్స్య సంపద సంతానోత్పత్తి నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో వేట నిషేధం అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 61 రోజుల పాటు సముద్రంలో వేట నిషేధం అమలులో ఉంటుందన్నారు. ఎటువంటి యాంత్రిక పడవల ద్వారా సముద్రంలో వేటకు వెళ్లరాదన్నారు. నిషేదాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు.
Similar News
News March 13, 2026
గన్నవరం: మంచుతో విమాన రాకపోకలకు అంతరాయం

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. విజిబిలిటీ తీవ్రంగా తగ్గిపోవడంతో విమానాల రాకపోకలు అంతరాయం కలిగాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ నుంచి రావాల్సిన విమానాలు కొంతసేపు గాల్లోనే చక్కర్లు కొట్టాయి. పరిస్థితి మెరుగుపడిన తర్వాతే విమానాల ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వడం జరిగిందని అధికార వర్గాలు వెల్లడించారు.
News March 13, 2026
కృష్ణాజిల్లాలో రేపు సెలవు రద్దు

కృష్ణా జిల్లాలోని విద్యా సంస్థలకు ఈ నెల 14న రెండో శనివారం శెలవు రద్దు చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి యువీ సుబ్బారావు గురువారం తెలిపారు. మొంథా తుపాన్ సమయంలో కాంపస్ శాటరీ శెలవుల దృష్ట్యా ఈ శనివారం పాఠశాలలకు శెలవు దినం రద్దు చేసినట్లు వివరించారు. ఆ రోజు అన్ని విద్యా సంస్థలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని డీఈఓ కోరారు.
News March 13, 2026
‘పది’ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: DEO

ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు కృష్ణా జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు డివిజన్లలో మొత్తం 411 పరీక్షా కేంద్రాల్లో 22,232 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని చెప్పారు. ప్రశ్నాపత్రాల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి, ఫ్లయింగ్ స్క్వాడ్ నియమించినట్లు తెలిపారు.


