News April 11, 2025
పాడేరు: ‘పీఎం-జుగా అమలకు సమగ్రమైన సర్వే’

ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ యోజన (పీఎం-జుగా) అమలు చేయడానికి సమగ్రమైన సర్వే నిర్వహించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. పీఎం-జుగా అమలుపై శాఖల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. శుక్రవారం ఐటీడీఏలో అధికారులతో సమావేశం నిర్వహించారు. పీఎం-జుగా సర్వే ప్రొఫార్మాలను జిల్లా అధికారులకు అందించి, సర్వే చేయాలని ఆదేశించారు. జిల్లాలో 521 గ్రామాలు కార్యక్రమం అమలుకు ఎంపిక చేశామన్నారు.
Similar News
News March 22, 2026
పాలమూరు: జిల్లాకు ప్రాణధారలు కృష్ణ, దుందుభి

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణ, దుందుభి నదులు వ్యవసాయానికి ఊపిరిపోస్తున్నాయి. జూరాల, కల్వకుర్తి ఎత్తిపోతలు, డిండి ప్రాజెక్టుల ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతోంది. నేడు ‘ప్రపంచ జల దినోత్సవం’ సందర్భంగా నీటి పొదుపుపై అవగాహన పెంచుకోవాలని, ఈ జీవనదులను కాపాడుకోవాలని నిపుణులు కోరుతున్నారు.
News March 22, 2026
NGKL: నేడు రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’

నేటి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమకానున్నాయి. తొలిదశలో ఎకరా లోపు భూమి ఉన్నవారికి పెట్టుబడి సాయం అందనుంది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని 3.41 లక్షల మంది రైతులకు గాను మొత్తం రూ.415.23 కోట్లు జమ చేయనున్నారు. జిల్లాలో సుమారు 8.30 లక్షల ఎకరాలకు ఈ పథకం వర్తించనుంది.
News March 22, 2026
ఏప్రిల్ నుంచి లైసెన్స్‌కు మూడు పరీక్షలు?

TG: రాష్ట్రంలో ప్రమాదాల నివారణకు లైసెన్స్ జారీలో త్రీ టైర్ సిస్టమ్ తేవాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం LLR, పర్మనెంట్ డ్రైవింగ్ టెస్ట్ ఉండగా ఇప్పుడు మరో టెస్ట్‌ను యాడ్ చేయనుంది. LLR పరీక్ష కన్నా ముందు ఆన్‌లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్ టెస్ట్ నిర్వహించాలని భావిస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో ఇది అమలులోకి వచ్చే అవకాశం ఉంది. మూడు గంటల నిడివిగల ఈ పరీక్షలో ఆరు పార్టులు ఉంటాయి.


