News April 12, 2025

నంద్యాల జిల్లా టుడే TOP NEWS.!

image

☞దొర్నిపాడులో అత్యధికంగా 40.9⁰C ఉష్ణోగ్రత ☞గృహా నిర్మాణాలు వేగవంతం చేయాలి: కలెక్టర్
☞ఇంటర్ ఫలితాల భయంతో విద్యార్థి ఆత్మహత్య
☞రూ.12.37 కోట్లతో కార్పొరేషన్ రుణాల చెక్కుల పంపిణీ: మంత్రి ఫరూక్
☞బనగానపల్లెలో పర్యటించిన మంత్రి బీసీ
☞పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత: ఎస్పీ
☞కొత్తగా పెళ్లి చేసుకునే వారికి బీసీ రాజారెడ్డి కానుక
☞మహానందిలో అరటి రైతుల కుదేలు
☞ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.

Similar News

News April 19, 2025

డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్

image

డ్రగ్స్ కేసులో మలయాళ నటుడు టామ్ చాకో అరెస్ట్ అయ్యారు. డ్రగ్స్ మత్తులో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ నటి ఫిర్యాదు చేయడంతో కేరళ పోలీసులు ఆయన ఉన్న హోటల్‌పై రైడ్ చేశారు. వారిని చూసి చాకో పరారయ్యారు. అప్పటి నుంచి ఆయన కోసం గాలింపు చేపట్టి, తాజాగా కొచ్చిలో అదుపులోకి తీసుకున్నారు. చాకో తెలుగులో దసరా, దేవర, రాబిన్‌హుడ్ తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.

News April 19, 2025

ఉమ్మడి కడప జిల్లాలో దారుణ ఘటన

image

ఉమ్మడి కడప జిల్లా గాలివీడు మండలంలో మతిస్థిమితం లేని మహిళపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళపై వెంకటరమణ లైంగిక దాడికి యత్నించాడు. బయట ఆడుకుంటున్న పిల్లలు ఇది గమనించి కేకలు వేయగా నిందితుడు వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

News April 19, 2025

ఈ ఏడాది చివర్లో ఇండియాకు వస్తా: మస్క్

image

ప్రధాని మోదీతో మాట్లాడటం గౌరవంగా ఉందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది చివర్లో భారత్‌లో పర్యటిస్తానని ఆయన రాసుకొచ్చారు. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన <<16137981>>ట్వీట్‌కు<<>> ఆయన రిప్లై ఇచ్చారు. కాగా, మస్క్‌కు చెందిన టెస్లా, స్టార్‌లింక్ కంపెనీలు త్వరలో ఇండియాలో తమ కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది.

error: Content is protected !!