News April 12, 2025

‘ఉపాధిహామీ పనులకు పెద్దఎత్తున మొబిలైజ్ చేయాలి’

image

ఉపాధిహామీ పథకం పనులకు పెద్దఎత్తున లేబర్‌ను మొబిలైజ్ చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. అధికారులతో ఆయన సమీక్షలో మాట్లాడుతూ.. మన జిల్లాలో ఉపాధిహామీ పథకం పనుల్లో ఆశించిన ప్రగతి రావడం లేదని అన్నారు. మన జిల్లాలో కూలిరేటు సరాసరి రూ.211 ఉన్నట్లు తెలిపారు. ప్రతి వారం ప్రగతి రావాలని, ఉపాధిహామీ పథకం పనులు వినియోగానికి ఈ రెండు నెలలు చాలా కీలకమని తెలిపారు.

Similar News

News March 16, 2026

బీఆర్ఎస్ నేతలతో జీవన్ రెడ్డి చర్చలు

image

మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ నాయకత్వంతో సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశాలు జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన ఈ చర్చల తరువాత ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో చర్చలు జరిగినట్లు సమాచారం.

News March 16, 2026

వడదెబ్బ నివారణపై అవగాహన పోస్టర్ల ఆవిష్కరణ

image

వడదెబ్బ నివారణపై బాపట్లలోని కలెక్టర్ అవగాహన పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదన్నారు. తగినంత నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తీసుకోవాలని తెలిపారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.

News March 16, 2026

ఇమామ్, మౌజమ్ల బకాయిలు విడుదల చేస్తాం: సీఎం

image

ఇమామ్, మౌజమ్ల బకాయిలు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం తరఫున విజయవాడలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇప్పటికే ఇమామ్, మౌజన్లకు రూ. 5 వేలు, రూ. 10 వేల చొప్పున రూ. 180 కోట్లు అందించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలకు పెద్ద ఎత్తున సంక్షేమం అందించామన్నారు.