News April 12, 2025

 రూ.2,700 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం: మంత్రి రాజనర్సింహ

image

రూ. 2700 కోట్లతో ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఉస్మానియా మెడికల్ కాలేజీ విద్యార్థుల 174వ స్నాతకోత్సవంలో పాల్గొని విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఉస్మానియా కళాశాల, ఆసుపత్రి ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతిగాంచినవని తెలిపారు.

Similar News

News February 24, 2026

సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో జపాన్ టూరిస్టుల సందడి

image

జపాన్ నుంచి నగరానికి వచ్చిన పర్యాటకులు South India Shopping Mallలో సందడి చేశారు. భారతీయ సంప్రదాయం, ఆధునిక డిజైన్‌లు, విస్తృత కలెక్షన్లు ఒకేచోట లభించడం వారిని ఆకట్టుకున్నట్లు తెలిపారు. దక్షిణ భారత సంప్రదాయ వస్త్రాల నాణ్యత, సరసమైన ధరలు, ఆతిథ్య సేవలు ప్రత్యేకంగా నచ్చాయన్నారు. ‘ఇది జీవితంలో బెస్ట్ షాపింగ్ అనుభవం’ అని వారు పేర్కొన్నారు. విదేశీయులను తమ మాల్ ఆకట్టుకుంటుందని నిర్వాహకులు తెలిపారు.

News February 24, 2026

భద్రాద్రి జిల్లాలో 2 సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణం!

image

మహిళా సంఘాల్లోని సభ్యుల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 2 సోలార్ పవర్ ప్లాంట్లను మంజూరు చేసింది. భద్రాద్రి జిల్లాలోని సుజాతనగర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామం, మణుగూరు మండలంలోని ఉడతనేని గుంపు గ్రామాల్లో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి ఎంపిక చేసింది. ఒక్కో పవర్ ప్లాంట్ నిర్మాణానికి రూ.3 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించనుంది

News February 24, 2026

కూలెంట్ లీకేజీ వల్లే పాల కల్తీ!

image

AP: రాజమండ్రిలో <<19215623>>పాల కల్తీకి<<>> గల కారణాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఫ్రిజ్‌లోని కూలెంట్ ఇథిలీన్ గ్లైకాల్(ఉష్ణోగ్రతను నియంత్రించే ఒక ప్రత్యేకమైన ద్రవం) లీకేజీ వల్లే కల్తీ జరిగిందని నిర్ధారించినట్లు తెలుస్తోంది. వరలక్ష్మీ డెయిరీ పేరిట అనధికారికంగా గణేశ్ కూలింగ్ ఛాంబర్ నిర్వహిస్తున్నట్లు తేలింది. వారం కిందట ఓ ఛాంబర్‌కు మరమ్మతులు చేస్తుండగా కూలెంట్ లీకై పాలలో కలిసినట్లు వార్తలు వస్తున్నాయి.