News April 12, 2025

ఇళ్ల ఎంపికలో జాప్యం వద్దు: భూపాలపల్లి కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయం నుంచి డీఆర్డీవో, డీఈఓ, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓలతో నిర్వహించిన వీసీలో కలెక్టర్ మాట్లాడారు. అనంతరం కాటారం డివిజన్‌లో లబ్ధిదారుల విచారణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

Similar News

News March 21, 2026

భారీగా పెరిగిన చికెన్ ధరలు!

image

రంజాన్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. నిన్నటి వరకు కేజీ రూ.330 వరకు విక్రయాలు జరిగాయి. ఇవాళ ఆ ధర భారీగా పెరిగి రూ.400కు చేరింది. విజయవాడలో కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.380-రూ.400 వరకు అమ్ముతున్నారు. హైదరాబాద్‌లో రూ.340-350 వరకు విక్రయిస్తున్నారు. ఎండల తీవ్రతకు ఉత్పత్తి తగ్గడమూ ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. మీ ప్రాంతంలో చికెన్ రేట్ ఎంత ఉంది?

News March 21, 2026

మహాత్మాగాంధీ యూనివర్సిటీకి రూ.25 కోట్లే!

image

Dy.CM భట్టి బడ్జెట్ ప్రసంగంలో MGUలో నూతనంగా LAW, ఫార్మసీ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. కానీ నిధుల కేటాయింపుల విషయానికి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రంగా వ్యవహరించింది. ఈ బడ్జెట్‌లో వర్సిటీకి కేవలం రూ. 25 కోట్లను మంజూరు చేసింది. ఈ అరకొర నిధులతో కొత్త కాలేజీలు ఎలా వస్తాయని, వర్సిటీ అభివృద్ధి ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా మిగులుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News March 21, 2026

ప్రీమియం పెట్రోల్ ధరల పెంపు.. కృష్ణా జిల్లాపై కోట్ల భారం

image

కేంద్ర ప్రభుత్వం ప్రీమియం పెట్రోల్‌పై రూ. 2.30 పెంపు చేయడంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో వినియోగదారులపై అదనపు భారం పడనుంది. జిల్లాలోని 350 బంకుల్లో రోజుకు 10.50 లక్షల లీటర్ల పెట్రోల్ వినియోగంలో సుమారు 10 శాతం ప్రీమియం వాటా ఉంది. ధర పెంపుతో రోజుకు రూ. 2.41 లక్షలు, నెలకు రూ. 72.45 లక్షలు, ఏడాదికి రూ. 8.69 కోట్ల భారం పడనుంది. దీంతో వినియోగం తగ్గే అవకాశముందని బంకుల యజమానులు చెబుతున్నారు.