News March 27, 2024

MBNR: రేపు ఎస్సీ స్టడీ సర్కిల్లో స్పాట్ అడ్మిషన్లు

image

SC స్టడీ సర్కిల్లో మూడు నెలల ఉచిత ఫౌండేషన్ కోర్సులో శిక్షణ పొందేందుకు అర్హులైన అభ్యర్థులకు 28న తక్షణ ప్రవేశాలు కల్పిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి వి.పాండు, స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఉచిత శిక్షణకు ఇప్పటికే 56 మంది ఎంపిక కాగా.. ఇంకా 44 సీట్లు ఖాళీలు ఉన్నాయని, వీటి భర్తీకి రేపే స్పాట్ అడ్మిషన్లు జరుగుతాయని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News April 3, 2026

గవర్నర్‌ను ఆహ్వానించిన ఎంపీ డీకే అరుణ

image

మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ శుక్రవారం హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. మహబూబ్‌నగర్‌లో ఏప్రిల్ 9 నుంచి 24 వరకు నిర్వహించనున్న ‘ఖేల్ సంసద్’ క్రీడా మహోత్సవం గురించి గవర్నర్‌కు వివరించారు. ఈ క్రీడల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలని కోరుతూ ఆహ్వాన పత్రం అందజేశారు. ముగింపు ఉత్సవానికి తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చినట్లు ఎంపీ అరుణ వెల్లడించారు.

News April 3, 2026

MBNR: మహిళల భద్రతకు ‘షీ టీమ్స్’ అండ: ఎస్పీ

image

MBNR జిల్లాలో మహిళలు, బాలికల భద్రతకు కట్టుబడి ఉన్నామని జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. మార్చి నెలలో షీ టీమ్స్ 15 ఫిర్యాదులు స్వీకరించి, 10 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 22 అవగాహన కార్యక్రమాలు, 75 హాట్‌స్పాట్ తనిఖీలు చేపట్టామన్నారు. మానవ అక్రమరవాణా నియంత్రణకు AHTU బృందాలు సమన్వయంతో పని చేస్తున్నాయని, ఆపదలో ఉన్నవారు పోలీసులను ఆశ్రయించాలని ఆమె సూచించారు.