News April 12, 2025
MNCL: ‘సంక్షేమ, అభివృద్ధి పనులను సమర్థంగా నిర్వహించాలి’

జిల్లాలోని గ్రామపంచాయతీల పరిధిలో సంక్షేమ, అభివృద్ధి పనులను అధికారులు సమన్వయంతో పని చేసి సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం నస్పూర్‌లోని మంచిర్యాల కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో గ్రామపంచాయతీలో అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. 2025 పూర్తయ్యేలోగా క్షయ వ్యాధి రహిత గ్రామ పంచాయతీలుగా మార్చాలని ఆదేశించారు.
Similar News
News November 24, 2025
మిడ్జిల్: రోడ్డుపై భారీ గుంత.. సూచికగా చెట్ల కొమ్ములు

మిడ్జిల్ మండలం మల్లాపూర్ గ్రామ రహదారిపై భారీగా గుంత పడింది. ఇటీవల ఈ రోడ్డు ఘోర యాక్సిడెంట్ జరిగి ఒక మహిళా చనిపోయింది. ఇది గమనించిన మల్లాపూర్ గ్రామానికి చెందిన కొప్పుల మధు పక్కనే ఉన్న చెట్లు కొమ్ములు గుర్తుగా పెట్టారు. చిన్న రోడ్లలో ప్రమాదాలకు ఈ గుంతలే అధికంగా కారణమవుతున్నాయని అన్నారు. మీ పరిసరాలలో ఎక్కడైనా రోడ్లపై ఇలాంటివి కనిపిస్తే ఏదైనా సూచికగా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
News November 24, 2025
ఇంటర్వ్యూతో ESICలో ఉద్యోగాలు

<
News November 24, 2025
కెనడా పౌరసత్వ చట్టంలో సవరణ.. విదేశీయులకు గుడ్‌న్యూస్

విదేశాల్లో పుట్టిన లేదా దత్తత తీసుకున్న చిన్నారుల పౌరసత్వంపై పరిమితులు విధిస్తూ 2009లో తెచ్చిన పౌరసత్వ చట్టంలో కెనడా సవరణ చేసింది. కొత్త చట్టం ద్వారా విదేశాల్లో పుట్టిన కెనడియన్లూ తమ సంతానానికి పౌరసత్వాన్ని బదిలీ చేసే ఛాన్స్ ఉండేలా మార్పులు చేస్తూ బిల్ సీ-3 తెచ్చింది. బిడ్డల్ని కనే ముందు 1075 రోజులు కెనడాలోనే ఉన్నట్లు ప్రూఫ్ చూపాలి. పాత చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని కెనడియన్ కోర్టు కొట్టేసింది.


