News April 12, 2025
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన కాజీపేట పోలీసులు

రోడ్డు ప్రమాదాల నివారణతో నేరస్థులను గుర్తించడంలో భాగంగా కాజీపేట్ ఎస్ఐ లవణ్ కుమార్ తన సిబ్బందితో కలిసి బంధం చెరువు ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులపై కేసు నమోదు చేసి వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మద్యం సేవించి వాహనం నడపడం నేరమని ఎస్ఐ వాహనదారులను హెచ్చరించారు.
Similar News
News January 16, 2026
రోహిత్ కెప్టెన్సీకి గంభీర్ చెక్.. మనోజ్ తివారీ సంచలన ఆరోపణలు!

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తీసేయడం వెనుక కోచ్ గంభీర్ హస్తం ఉండొచ్చని మనోజ్ తివారీ అనుమానం వ్యక్తం చేశారు. అగార్కర్ కోచ్ ప్రభావానికి లోనై ఉండొచ్చేమోనని, రోహిత్ లాంటి లెజెండ్‌ను పక్కన పెట్టడం క్రీడా ధర్మానికి విరుద్ధమన్నారు. 2027 వరల్డ్ కప్ ఆడగల సత్తా ఉన్న హిట్‌మ్యాన్‌ను కాదని గిల్‌కు బాధ్యతలు ఇవ్వడంలో లాజిక్ లేదన్నారు. ఇది రోహిత్‌ను అవమానించడమేనని ఫైర్ అయ్యారు.
News January 16, 2026
హనుమకొండ: ‘ఈనెల 18న ఖమ్మంలో సీపీఐ శత వార్షికోత్సవాల ముగింపు సభ’

జనవరి 18న సీపీఐ శతవార్షికోత్సవాల సందర్భంగా ఖమ్మంలో జరుగనున్న భారీ బహిరంగ సభకు భారీగా తరలి రావాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు కోరారు. శుక్రవారం HNK బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశం హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
News January 16, 2026
నిర్మల్: మహిళా సంఘాలకు చెక్కు అందజేత

మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్‌లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు రూ.650 కోట్ల విలువ చేసే చెక్కు అందజేశారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ రుణాలు ఎంత దోహదం చేస్తాయన్నారు.


