News April 12, 2025
NGKL: సళేశ్వరం జాతరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాం: ఎస్పీ

సళేశ్వరం జాతరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో దక్షిణ అమర్నాథ్ యాత్రగా పేరుపొందిన సళేశ్వర జాతరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం నీటి సౌకర్యం, ఆహార వితరణ, క్యూలైన్ దర్శనం, మెడికల్ ఎమర్జెన్సీ, CC కెమెరాలు ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ గురించి సిబ్బందికి పలు సూచనలు చేశామన్నారు.
Similar News
News July 7, 2025
బల్దియా సమావేశాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు

అట్టహాసంగా ప్రారంభమైన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాన్ని కొద్దీ సేపటికే బీఆర్ఎస్ కార్పొరేటర్లు బహిష్కరించి బయటకు వచ్చారు. భద్రకాళి చెరువు విషయంలో చర్చ లేవనెత్తడంపై మేయర్ సుధారాణి అనుమతించకపోవడంతో కార్పొరేటర్లు అసహనానికి గురయ్యారు. దీంతో సమావేశాన్ని బహిష్కరించి బయటికు వచ్చి నిరసన చేపట్టారు.
News July 7, 2025
స్థానిక సంస్థలపై ఫోకస్: రామ్‌చందర్ రావు

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తమకు సవాల్ అని BJP రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు అన్నారు. బలమైన ప్రతిపక్షం ఉంటే బైఎలక్షన్‌లో అధికార పార్టీ గెలవదని జోస్యం చెప్పారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలపై BJP ఫోకస్ చేయలేదని, ఈ సారి వీటిపై ఫోకస్ పెడతామని స్పష్టం చేశారు. 25 రోజుల్లో పూర్తిస్థాయి రాష్ట్ర కమిటీని ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్ర కమిటీలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
News July 7, 2025
నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశం కోసం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తులను https://navodaya.gov.in వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. ప్రవేశాలకు డిసంబర్ 13న పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.