News April 12, 2025

GWL: పోషకాహార లోపనివారణకు కలెక్టర్ ఆదేశాలు

image

గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపం నివారణకు పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లాస్థాయి కన్వర్జెన్సీ సమావేశం జరిగింది. ఏప్రిల్ 8 నుంచి 22 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గర్భధారణ ప్రారంభం నుంచి శిశువు పుట్టినరోజు వరకు 1000 రోజుల కాలంలో పోషకాహారంపై దృష్టి సారించాలని అన్నారు.

Similar News

News March 19, 2026

అమెరికాలోకి డ్రోన్లు.. హై అలర్ట్‌లో వాషింగ్టన్!

image

ఇరాన్‌తో ఉద్రిక్తతల వేళ వాషింగ్టన్‌లోని ఫోర్ట్ మెక్‌నాయర్ మిలిటరీ బేస్‌పై గుర్తుతెలియని డ్రోన్లు తిరగడం కలకలం సృష్టించింది. ఈ ప్రాంతంలోనే US విదేశాంగ మంత్రి రూబియో, రక్షణ మంత్రి హెగ్‌సెత్ నివాసాలు ఉండటంతో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. గత 10 రోజులుగా ఇక్కడ డ్రోన్ల కదలికలు కనిపిస్తుండటంతో ఉన్నతాధికారులు ఎమర్జెన్సీ మీటింగ్స్ నిర్వహించారు. ఇరాన్ ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.

News March 19, 2026

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రివ్యూ&రేటింగ్

image

అవినీతి నాయకులు, వారికి సాయపడే టెర్రరిస్టులను హీరో ఎలా ఎదుర్కొన్నారనేదే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్టోరీ. మేనరిజమ్స్, డాన్సులు, నటనతో పవన్ వన్‌మ్యాన్ షో చేశారు. చిరు-పవన్ పాత సాంగ్స్ ఆకట్టుకుంటాయి. శ్రీలీల నటన బాగుంది. ఫ్యాన్స్ కోసం మాస్ ఎలివేషన్స్, డైలాగులతో డైరెక్టర్ హరీశ్ శంకర్ కథను నడిపించారు. ఔట్‌డేటెడ్ స్టోరీ, కొన్ని లాజిక్ లేని సీన్లు, BGM మైనస్. కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు.
రేటింగ్: 2.5/5

News March 19, 2026

శ్రీశైలం ప్రాజెక్టు భూకబ్జాదారుల గుండెల్లో రైళ్లు..!

image

శ్రీశైలం ప్రాజెక్టు (సున్నిపెంట) భూ కబ్జాలపై కలెక్టర్ కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో ఆక్రమదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గతంలో విజిలెన్స్ కమిటీ 121 ఎకరాల పరిధిలోని జలవనరుల శాఖ భూములు, ప్రభుత్వ గృహాలు కబ్జాకు గురైనట్లు నివేదిక సమర్పించింది. ప్రస్తుతం తిరిగి స్వాధీనం చేసుకునేందుకు క్షేత్ర స్థాయిలో రేపటి నుంచి కమిటీ సర్వే చేయనుంది. సర్వే తదుపరి ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.