News April 12, 2025
కృష్ణా: ‘నేటి నుంచి ధాన్యం కేంద్రాలు ఓపెనింగ్’

2024-25 పంట కాలానికి సంబంధించి ధాన్యం సేకరణ కేంద్రాలు శనివారం నుంచి జిల్లాలో తెరిచి ఉంటాయని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ శుక్రవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించుకోవచ్చన్నారు.
Similar News
News March 16, 2026
GDV: ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఖో-ఖో పోటీలకు రాజ్ కుమార్ ఎంపిక!

గుడివాడకి చెందిన క్రీడాకారుడు రాజ్ కుమార్ మరోసారి జాతీయస్థాయిలో మెరవనున్నారు. ఈనెల 19 నుంచి 22 వరకు మహారాష్ట్రలోని పూణే వేదికగా జరిగే ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఖో-ఖో టోర్నమెంట్‌కు ఆయన ఎంపికయ్యారు. AP జట్టు తరఫున రాజ్ కుమార్ ప్రాతినిధ్యం వహించడంపై AP ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. గతంలోనూ రాజ్ కుమార్ జాతీయ పోటీల్లో పతకాలు సాధించి రాష్ట్రానికి పేరు తెచ్చారని ఆయన కొనియాడారు.
News March 16, 2026
కృష్ణా: పాలక వర్గం లేకపోవడమే.. అక్కడ శాపం

చారిత్రక నేపథ్యం ఉన్న యనమలకుదురు రామలింగేశ్వర స్వామి ఆలయానికి పాలకవర్గం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకే వ్యక్తి ఆధిపత్యం కోసం కమిటీ ఏర్పాటును అడ్డుకుంటున్నారని, దీనిపై ఎమ్మెల్యే కూడా మౌనం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఆలయంలో రూ. 10 లక్షల మాయంపై కేసు నమోదైనా, పోలీసులకు ఆధారాలు ఇవ్వకుండా దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
News March 16, 2026
అమరజీవి త్యాగం తెలుగు జాతికి ఆదర్శం: అడిషనల్ ఎస్పీ

జిల్లా పోలీస్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ వి.వి. నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీరాములు గారు తెలుగు ప్రజలందరికీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఇన్స్పెక్టర్లు రవికిరణ్, రవి కుమార్ పాల్గొన్నారు.


