News April 12, 2025

రైతులు దళారులను ఆశ్రయించవద్దు: కలెక్టర్

image

రైతులు మద్దతు ధరకు ధాన్యాన్ని ఆర్ఎస్కేల ద్వారా మాత్రమే అమ్మాలని ఎట్టి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించవద్దని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. శుక్రవారం పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల రైతు సేవా కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కొనుగోలు పక్రియను పరిశీలించారు. తేమ శాతాన్ని లెక్కించే మీటర్‌ను కూడా పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు.

Similar News

News March 21, 2026

ఏళ్లు గడుస్తున్నా అందని టిడ్కో ఇళ్లు.. లబ్ధిదారుల కంటతడి!

image

సొంతింటి కల నెరవేరుతుందని ఏళ్లుగా ఎదురుచూస్తున్న టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు నిరాశే మిగులుతోంది. దసరా, సంక్రాంతి, ఉగాది అంటూ గడువు పొడిగిస్తున్నారే తప్ప ఇళ్లను అప్పగించడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఒకవైపు బ్యాంకులకు ఈఎంఐలు చెల్లిస్తూ, మరోవైపు అద్దె ఇళ్ల భారం మోయలేక తిని తినక కాలం వెళ్లదీస్తున్నామని వాపోతున్నారు. తక్షణమే ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

News March 21, 2026

ప.గో: అలర్ట్.. దరఖాస్తుల ఆహ్వానం

image

ప.గో జిల్లాలో పర్యాటక రంగాన్ని వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌లో టూరిజంపై మాట్లాడిన ఆమె, టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తిగలవారు ceo-apta@ap.gov.in మెయిల్ ఐడీకి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 21, 2026

పశ్చిమలో ఆసక్తికర చర్చ..!

image

2029 సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ చట్టం అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుండటంతో మహిళల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. గత ఎన్నికల్లో జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ, టీడీపీ పార్టీలు మహిళలకు అవకాశం కల్పించలేదు. మహిళా బిల్లు అమలులోకి వస్తే జిల్లాలో మహిళలకు ఎన్ని సీట్లు దక్కుతాయి, ఏయే స్థానాలను వారికి రిజర్వ్ చేస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది.