News April 12, 2025
వ్యూహాత్మకంగా పని చేయాలి: కర్నూలు కలెక్టర్

సమస్యలపై అధికారులు వ్యూహాత్మకంగా పని చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సునీత ఆడిటోరియంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా వర్క్ షాప్ నిర్వహించారు. అన్ని విషయాలపై అవగాహన ఉండాలని సూచించారు. జేసీ డా. బి.నవ్య, సబ్ కలెక్టర్, డిఆర్వో, ఆర్డీవోలు, తహశీల్దార్లు, సర్వేయర్లు ఉన్నారు.
Similar News
News March 7, 2026
కర్నూలు: కాలేజీకి రాకుండానే పరీక్షలు.. బీఈడీ కాలేజీల దందా!

కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, హోళగుందలోని పలు బీఈడీ కాలేజీలు బ్లాక్ టీచింగ్ నిర్వహించకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాలేజీకి రాకుండానే పరీక్షలు రాసేలా యాజమాన్యాలు విద్యార్థులతో ఒప్పందాలు కుదుర్చుకొని భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. RJD స్థాయిలో విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘిస్తున్న కాలేజీల అనుమతులు రద్దు చేయాలని DSF విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది.
News March 7, 2026
సర్వైకల్ క్యాన్సర్ నివారణకు HPV టీకా డ్రైవ్

జిల్లాలో సర్వైకల్ క్యాన్సర్ నివారణ లక్ష్యంగా HPV వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. 14 ఏళ్లు నిండి 15వ ఏట అడుగుపెట్టే బాలికలకు ‘గార్డాసిల్-4’ టీకా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంటుందని చెప్పారు. జిల్లాలో 19,704 మంది బాలికలను లక్ష్యంగా తీసుకుని ఈ కార్యక్రమం మూడు నెలలు కొనసాగుతుందని వెల్లడించారు.
News March 6, 2026
అక్రమ మైనింగ్‌ను కట్టడి చేయాలి: కలెక్టర్

జిల్లాలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టడంతో పాటు మైనింగ్‌కు సంబంధించిన అనుమతులను నిబంధనల ప్రకారం మంజూరు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మైన్స్ అండ్ జియాలజీ శాఖకు సంబంధించిన అంశాలపై జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. సహజ వనరులను సంరక్షించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అన్నారు.


