News April 12, 2025
తిరుపతి ప్రజలకు గమనిక

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ఇంటి పన్ను, ఖాళీ జాగా పన్నులను చెల్లిస్తే 50 శాతం వడ్డీ మినహాయింపును ఈ నెలాఖరు వరకు పొడిగించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య శుక్రవారం తెలిపారు. 2024-25 సంవత్సరంలో పెండింగ్ ఉన్న బకాయిలు ఏప్రిల్ 30వ తేదీలోపు ఒకేసారి చెల్లిస్తే ప్రస్తుతమున్న వడ్డీపై 50 శాతం రాయితీ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని బకాయిదారులు వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News January 14, 2026
మంగపేటలో మీసేవ నిర్వాహకుడి ఆత్మహత్య

ములుగు జిల్లాలోని మంగపేటలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానిక మీసేవ కేంద్రం నిర్వాహకుడు తాళ్లపల్లి వీర కిషోర్ గౌడ్ (40) తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిషోర్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
News January 14, 2026
HYD: పండగకు అన్నీ తింటున్నారా? జర జాగ్రత్త!

సంక్రాంతి వేడుకల వేళ తిండిపై నియంత్రణ లేకపోతే తిప్పలు తప్పవంటున్నారు నిపుణులు. విందులు, చిరుతిళ్లు, నిద్రలేమితో గుండె, కాలేయంపై ఒత్తిడి పెరుగుతోందని HYDలోని డా.సయ్యద్ ముస్తఫా అష్రఫ్ హెచ్చరించారు. మితిమీరిన మద్యం, మసాలా ఆహారంతో ఫ్యాటీ లివర్ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డా.కార్తికేయ రామన్‌రెడ్డి పేర్కొన్నారు. నీళ్లు బాగా తాగుతూ, నడుస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.
News January 14, 2026
మైక్రో చీటింగ్‌తో కాపురాల్లో చిచ్చు

భాగస్వామిని పూర్తిగా నిర్లక్ష్యం, మోసం చేయకుండా.. చిన్నచిన్న తప్పులు చేస్తుండటమే.. ‘మైక్రో చీటింగ్’. ఇది అక్రమ సంబంధం అంత స్పష్టంగా ఉండదు. ఇందులో చాలామందికి చెడు ఉద్దేశాలూ ఉండవని అంటున్నారు నిపుణులు. కానీ చిన్నచిన్న తప్పులతోనే దంపతుల మధ్య నమ్మకం, భావోద్వేగ భద్రత దెబ్బతిని దీర్ఘకాలంలో విడాకులకూ దారితీస్తున్నాయి. ఇలాంటి విషయాలపై ఇద్దరూ కలిసి చర్చించుకుంటే.. సమస్య పరిష్కారం అవుతుందని అంటున్నారు.


