News April 12, 2025
రేణిగుంట ఎయిర్ పోర్ట్‌లో RRRకు వీడ్కోలు

రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుకు సాదర వీడ్కోలు లభించింది. శుక్రవారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానంతరం ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో కూటమి నాయకులు ఆయనకు వీడ్కోలు పలికారు. అనంతరం విమానంలో విజయవాడకు బయలుదేరి వెళ్లారు.
Similar News
News October 27, 2025
కాకినాడ వాతావరణం ప్రశాంతంగా ఉంది: పోలీసులు

కాకినాడ జిల్లా తీర ప్రాంతం అతలాకుతలం అంటూ కొందరు ఫేక్ వీడియో వైరల్ చేస్తున్నారు. దీనిపై జిల్లా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారం నమ్మవద్దని కోరారు. జిల్లా యంత్రాంగం, పోలీసులు ఇచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రజలు విశ్వసించాలని సూచించారు. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదారి పట్టించవద్దన్నారు. కాకినాడ జిల్లాలో వాతావరణం ప్రశాంతంగా ఉందని స్పష్టం చేశారు.
News October 27, 2025
జీకేవీధి: అంతర్రాష్ట్ర సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత

మొంథా తుఫాను నేపథ్యంలో విశాఖ నుంచి జీకేవీధి మండలం సీలేరు మీదుగా భద్రాచలం వెళ్లే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను సోమవారం సాయంత్రం నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు విశాఖ ఆర్టీసీ డిపో మేనేజర్ మాధురి తెలిపారు. తుఫాను కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈనెల 29వరకూ నిలిపివేస్తున్నామన్నారు.
News October 27, 2025
ప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి ప్రజల అర్జీలను స్వీకరించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ఎంపిక, భూవివాదాలు వంటి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, తగు చర్యలు తీసుకోవాలని వారు జిల్లా అధికారులను ఆదేశించారు.


