News April 12, 2025
ఈరోజు నమాజ్ వేళలు

ఏప్రిల్ 12, శనివారం
ఫజర్: తెల్లవారుజామున 4.49 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.02 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.17 గంటలకు
అసర్: సాయంత్రం 4.43 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.32 గంటలకు
ఇష: రాత్రి 7.45 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News April 19, 2025
లిక్కర్ స్కాం కేసు.. ఆడియో విడుదల చేసిన రాజశేఖర్ రెడ్డి

AP లిక్కర్ స్కాం కేసులో పరారీలో ఉన్న నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఓ ఆడియో విడుదల చేశారు. ‘MARలో సిట్ అధికారులు మా ఇంటికి వచ్చారు. మా అమ్మకు నోటీసులు ఇచ్చివెళ్లారు. 24 గంటల్లోనే నేను స్పందించి ఎందుకు పిలిచారని అధికారులను అడిగా. అయినా రెండోసారి మెయిల్‌కు నోటీసులు పంపారు. దీంతో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశా. విచారణకు సహకరిస్తా’ అని చెప్పారు. ఇదే కేసులో VSR నిన్న విచారణకు హాజరయ్యారు.
News April 19, 2025
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం!

ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లాస్ ఏంజెలిస్‌లో జరిగే 2028 ఒలింపిక్స్‌లో స్కాట్లాండ్‌తో కలిసి బరిలోకి దిగనుందని సమాచారం. రెండు జట్లు కలిపి గ్రేట్ బ్రిటన్‌గా పాల్గొంటాయని క్రీడావర్గాలు తెలిపాయి. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ మ్యాచులకు మొదటి ఆరు ర్యాంకుల్లో ఉన్న జట్లకు ఎంట్రీ కల్పిస్తారు.
News April 19, 2025
రైల్వే టికెట్ల మోసం.. అమాయకులు బలి!

కుశినగర్ EXP(22538)లో రైల్వే విజిలెన్స్ విభాగం తనిఖీలు చేయగా, తత్కాల్ టికెట్ల స్కామ్ బయట పడింది. UP, బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి బుక్ చేసిన తత్కాల్ టికెట్లను ముంబై ఏజెంట్లు కలర్ జిరాక్స్ తీస్తున్నారని, వాటికి రూ.3వేలు అదనంగా ప్రయాణికుల వద్ద దండుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. రైల్వే నిబంధనల ప్రకారం నకిలీ టికెట్లతో ప్రయాణిస్తున్న64 మందికి రూ.1.2లక్షలు జరిమానా విధించారు.