News April 12, 2025
ఉమ్మడి జిల్లాలో రేపు మద్యం దుకాణాలు బంద్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని అన్ని మద్యం దుకాణాలు మూసివేయాలని జిల్లా కలెక్టర్లు అధికారులను ఆదేశించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూసి ఉంచాలని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులను పాటించని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News April 14, 2025
BREAKING: మహబూబ్నగర్లో తీవ్ర విషాదం

మహబూబ్నగర్లో ఈరోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మహబూబ్నగర్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద క్వారీ గుంతలో ఈతకు దిగిన ముగ్గురు యువకులు నీట మునిగారు. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఒక యువకుడి మృతదేహం లభ్యం కాగా మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇద్దరు యువకులు మునిగిపోతుండగా వాళ్లని కాపాడబోయి మరో యువకుడు కూడా మునిగిపోయాడు.
News April 14, 2025
MBNR: మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న మహమ్మదాబాద్ మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. జంగంరెడ్డిపల్లికి చెందిన ఆనంద్(24) HYDలో కూలీ పనిచేసుకుని జీవిస్తున్నాడు. శనివారం సొంతూరుకు వచ్చాడు. మద్యానికి బానిసైన ఆనంద్.. తనకంటూ ఎవరూ లేరని తనలో తాను కుమిలిపోవటం చేస్తుండేవాడు. ఈ క్రమంలో పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదైంది.
News April 14, 2025
జడ్చర్లలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

బాదేపల్లిలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. పాతబజార్కు చెందిన అంజమ్మ(73) శనివారం రాత్రి తన చిన్న కొడుకు నగేశ్ ఇంట్లో నిద్రపోయింది. ఆదివారం తెల్లవారుజామున ఇంటి ఎదుట రోడ్డుపై శవమై కనిపించింది. ఇంట్లో పడుకున్న ఆమె రోడ్డుపై శవమై పడి ఉండటంతో కుటుంబసభ్యుల అనుమానం వ్యక్తం చేశారు. ఆమె మృతికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. ఈమేరకు కేసు నమోదైంది.