News March 27, 2024
౩వ తేదీ నుంచి పింఛన్ల పంపిణీ

పుట్టపర్తి: ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఏప్రిల్ నెలలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ ప్రక్రియ 3వ తేదీ నుంచి ఉంటుంది. ఈ మేరకు డీఆర్‌డీఏ పీడీ నరసయ్య మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుందని, దీంతో 1వ తేదీ కాకుండా 3వ తేదీ నుంచి పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా వారిని చైతన్య పరచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Similar News
News March 21, 2026
పరీక్ష వాయిదా: అనంతపురం DEO

రంజాన్ నేపథ్యంలో శనివారం పదో తరగతి విద్యార్థులకు జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసిందని డీఈవో ప్రసాద్ బాబు తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీన ఈ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఆరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష ఉంటుందని.. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News March 21, 2026
అనంతపురం: గ్యాస్ సరఫరాపై కలెక్టర్ కీలక సూచనలు

అనంతపురం కలెక్టర్ ఓ. ఆనంద్ గ్యాస్ సరఫరాపై వినియోగదారులకు కీలక సూచనలు చేశారు. ఆలమూరులోని గ్యాస్ గోడౌన్, నగరంలోని పవన్ గ్యాస్ ఏజెన్సీని తనిఖీ చేసిన ఆయన, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి సకాలంలో గ్యాస్ అందుతుందని స్పష్టం చేశారు. వినియోగదారులు ఆందోళనతో ఏజెన్సీల వద్దకు రావద్దని, యధావిధిగా ఇంటి వద్దకే డోర్ డెలివరీ జరుగుతుందని భరోసా ఇచ్చారు. అవసరానికి మించి అదనపు బుకింగ్‌లు చేయవద్దన్నారు.