News April 12, 2025

కథలాపూర్: బైకు అదుపుతప్పి యువకుడి మృతి

image

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన పల్లికొండ అజయ్ (17) అనే యువకుడు శుక్రవారం రాత్రి బైకు అదుపుతప్పి పడిపోగా మృతిచెందినట్టు పోలీసులు పేర్కొన్నారు. అజయ్ బైక్‌పై గ్రామ శివారులోకి వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు రోడ్డు పక్కకు దూసుకెళ్లి పడిపోయారు. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Similar News

News July 4, 2025

ఖమ్మం: తీవ్ర విషాదం.. ఇద్దరు యువకుల మృతి

image

ఖమ్మం జిల్లాలో శుక్రవారం ఘోర విషాదం నెలకొంది. చింతకాని మండలం చిన్న మండవ గ్రామంలో వాగులో ఇద్దరు యువకులు నీట మునిగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన వారు అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 4, 2025

పెరుగుతున్న ట్రాఫిక్ జామ్స్.. ఏం చేయాలి?

image

HYDలో ‘కిలోమీటర్ దూరానికి గంట పట్టింది’ అని వే2న్యూస్‌లో పోస్ట్ అయిన <<16941177>>వార్తకు<<>> యూజర్లు తమ అభిప్రాయాలు తెలియజేశారు. ఒక్కరి ప్రయాణం కోసం కార్లను వాడటం ట్రాఫిక్‌కు ప్రధాన కారణమని అంటున్నారు. కంపెనీలన్నీ ఒకే చోట ఉన్నాయని, వాటిని వివిధ ప్రాంతాలకు తరలించాలని మరికొందరు సూచించారు. మెట్రో, ఆర్టీసీ లాంటి ప్రజారవాణాకు పెద్దపీట వేయాలంటున్నారు. HYDలో ట్రాఫిక్ తగ్గించేందుకు ఏం చేయాలో కామెంట్ చేయండి.

News July 4, 2025

విశాఖలో 50 అంతస్తుల అపార్ట్మెంట్లు.. డిజైన్లు ఇవే

image

విశాఖలో మధురవాడ పరిసర ప్రాంతాల్లో 50 అంతస్తుల 3BHK, 4 BHK ఫ్లాట్స్, 4BHK డూప్లెక్స్ ఫ్లాట్స్‌ని V.M.R.D.A నిర్మించనుంది. సర్వే నంబర్ 331/1 లోని 4.07 ఎకరాల విస్తీర్ణంలో అపార్ట్మెంట్ల నిర్మాణానికి డిజైన్లు సిద్ధం చేశారు. 6 టవర్లు, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ తదితర అత్యాధునిక వసతులు కల్పించనున్నారు. జాయింట్, PPP పద్ధతిలో ఈ ప్రాజెక్టు చేపడతారు. విశాఖలో ఇప్పటివరకు 50 అంతస్తులు అపార్ట్మెంట్లు లేవు.