News April 12, 2025

ధర్నాలు, ర్యాలీలకు అనుమతి తప్పనిసరి: సీపీ

image

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ర్యాలీలు, ధర్నాలు, సభలు, సమావేశాలకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సిద్దిపేట పోలీసు కమిషనర్ డాక్టర్ అనురాధ సూచించారు. ఈ నెల 13 నుంచి 28 వరకు కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నామని తెలిపారు. కావున ఏవైనా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు చేయాలంటే తప్పనిసరిగా పోలీసులు అనుమతి తీసుకోవాలని సూచించారు.

Similar News

News November 16, 2025

జగిత్యాల: 4 జంటలను కలిపిన లోక్ అదాలత్

image

జగిత్యాల జిల్లా కోర్టులో NOV 15 నుంచి జరుగుతున్న ప్రత్యేక లోక్ అదాలత్‌ను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి సూచించారు. సంవత్సరాల తరబడి లాగకుండా, రాజీతో వేగంగా కేసులను పరిష్కరించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని తెలిపారు. ఇప్పటివరకు న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసుల చొరవతో విడాకుల అంచున ఉన్న నలుగురు దంపతులను ఈ లోక్ అదాలత్ మళ్లీ కలిపింది.

News November 16, 2025

సిరిసిల్ల: పడిపోయిన ఉష్ణోగ్రతలు.. వణుకుతున్న జనం

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. ఒక్కసారిగా పెరిగిన చలితో జనం వణుకుతున్నారు. చలి నుంచి రక్షణకు అవసరమైన చర్యలపై ప్రజలు దృష్టి సారించారు. వృద్ధులు, చిన్నపిల్లలు చలి మంటలు వేసుకునే దృశ్యాలు కనిపిస్తున్నాయి. స్వెటర్లు, మఫ్లర్ ధరించడం ద్వారా కొంత ఉపశమనం పొందుతున్నారు. జిల్లాలో రాత్రివేళ రుద్రంగిలో 9.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత, ఇల్లంతకుంటలో 15.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

News November 16, 2025

సిరిసిల్ల: రబీలో లక్ష 94 వేల ఎకరాల్లో పంట సాగుకు అంచనా

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రబీ సీజన్ (యాసంగి)లో సుమారు లక్ష 94 వేల ఎకరాల్లో పంటలు సాగు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురవడంతో చెరువుల్లో పూర్తిస్థాయిలో నీరు చేరింది. దీంతో 1,83,000 ఎకరాల్లో వరి సాగుకు, 11 వేల ఎకరాల్లో మొక్కజొన్న, పొద్దు తిరుగుడు తదితర పంటల సాగుకు ప్రణాళిక రూపొందించిన అధికారులు ఇందుకు గాను 45,312 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని అంచనా వేశారు.