News April 12, 2025

హనుమకొండ: గంజాయితో పట్టుబడిన ముగ్గురు అరెస్ట్

image

హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి ఒక కిలో 750 గ్రాముల గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలు, రెండు సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారని హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు.

Similar News

News March 7, 2026

చిత్తూరు జిల్లాలో 250 మంది ట్రాన్స్‌ఫర్

image

చిత్తూరు పోలీసు శాఖలో 250 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ ఎస్పీ తుషార్ డూడీ ఉత్తర్వులు జారీచేశారు. చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సమక్షంలో బదిలీ కౌన్సెలింగ్ శుక్రవారం చేపట్టారు. ఇందులో 125 మంది కానిస్టేబుళ్లు, 60 మందికి పైగా హెడ్ కానిస్టేబుళ్లు, 50 మంది వరకు ఏఎస్ఐలు ఉన్నారు. ఒకే స్టేషన్లో మూడేళ్లుగా పనిచేస్తున్న వాళ్ల నుంచి ఐదేళ్ల పాటు పనిచేస్తున్న సిబ్బందికి కౌన్సెలింగ్ నిర్వహించారు.

News March 7, 2026

అల్లు అర్జున్‌తో శిల్పా రవి

image

అల్లు శిరీష్, నయనికా రెడ్డిల వివాహ వేడుకకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హాజరయ్యారు. పెళ్లి వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం, ఆయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కలిశారు. ఈ సందర్భంగా శిల్పా రవి దంపతులు అల్లు అర్జున్‌తో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

News March 7, 2026

సివిల్స్‌లో సత్తా చాటిన ఇల్లందు బిడ్డ

image

‘కష్టేఫలి’ అనే మాటకు నిదర్శనంగా నిలిచింది ఇల్లందుకి చెందిన బానోతు లక్ష్మీ రచన. ఇటీవల విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఆమె 178వ ర్యాంకు సాధించి మెరిశారు. బానోత్ వెంకటరమణ, తులసమ్మల కుమార్తె అయిన లక్ష్మి మూడుసార్లు విఫలమైనా పట్టు వదలకుండా నాలుగో ప్రయత్నంలో విజయం సాధించారు. గతంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లి త్రుటిలో అవకాశం కోల్పోయినా, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పట్టుదలతో చదివి ఈ ఘనత సాధించారు.