News April 12, 2025

బాసర: మా సమస్యలు పరిష్కరించండి: ప్రొఫెసర్లు

image

బాసర RGUKT టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో VC ప్రొఫెసర్ గోవర్ధన్‌కి వినతిపత్రం అందజేశారు. జీవో నెంబర్ 21రద్దు చేయాలని RGUKT స్థాపన నుంచి చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నామని అధ్యక్షుడు శ్రీశైలం తెలిపారు. TS ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్ పోస్టులను నియమించాలని జీవో NO 21 తీవ్ర ఆందోళనలకు గురవుతున్నామన్నారు. తమను రెగ్యులరైజ్ చేసిన తర్వాత రెగ్యులర్ నోటిఫికేషన్‌కు వెళ్లాలన్నారు.

Similar News

News March 17, 2026

పాలమూరు: ఆస్తి పన్ను చెల్లించలేదని ఫంక్షన్ హాల్ సీజ్

image

కల్వకుర్తి పట్టణ పరిధిలో ఆస్తి పన్ను బకాయిలు చెల్లించని వారిపై మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. నోటీసులు ఇచ్చినా స్పందించని వారి గృహాలు, వ్యాపార సముదాయాలకు తాళాలు వేసి సీల్ వేస్తామని కమిషనర్ హెచ్చరించారు. ఇందులో భాగంగానే కుర్మిద్ద రోడ్డులోని రాయల్ ఫంక్షన్ హాల్ పన్ను బకాయి ఉన్నందున దానికి తాళం వేసి సీజ్ చేశారు.

News March 17, 2026

బొప్పాయిలో గొంగళి పురుగు నివారణ ఎలా?

image

బొప్పాయి పంట చుట్టూ ఎర పంటలుగా అలసందలు, ఆముదం వేయాలి. కలుపు నివారించాలి. తొలి దశలో ఎకరాకు 2-3 దీపపు ఎరలను అమర్చాలి. ఆకు కింది భాగంలో లార్వాల నిర్మూలనకు వేప కషాయాన్ని పిచికారీ చేయాలి. గొంగళి పురుగుల నివారణకు లీటరు నీటికి క్లోరోపైరిపాస్ 2ml లేదా ప్రొపినోపాస్ 2ml లేదా క్వినాల్‌పాస్ 2ml కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉద్ధృతి ఎక్కువ ఉంటే లీటరు నీటికి లామ్డాసైహలోత్రిన్ 1mlను కలిపి పిచికారీ చేయాలి.

News March 17, 2026

హనుమాన్ చాలీసా ఎందుకు పఠించాలి?

image

పూర్వం తులసీదాసు జైలులో బంధీగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా రచంచి, పఠించారు. అప్పుడు వేల వానరాలు రాజభవనంపై దాడి చేశాయి. ఆ తర్వాత మొఘల్ చక్రవర్తి అది దైవ సంకల్పమని గ్రహించి, తులసీదాసును విడుదల చేసి క్షమాపణ కోరాడు. కోతులు కూడా శాంతించి అక్కడి నుంచి వెళ్లాయి. తులసీదాసు భక్తి ఆయనను ప్రాణాపాయం నుంచి కాపాడింది. అందుకే మన ఆపదలు తొలగి, ధైర్యం కలగాలంటే రోజూ హనుమాన్ చాలీసా పఠించాలని పండితులు సూచిస్తారు.