News April 12, 2025
ప్రజారోగ్యానికి ప్రభుత్వం భరోసా.. రూ.85 కోట్లు మంజూరు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.85 కోట్లు మంజూరు చేసిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. TG సెక్రటేరియట్‌లో మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన శుక్రవారం సమీక్షా సమావేశం జరిగింది. షబ్బీర్ అలీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి ఈ నిధులను మంజూరు చేసినట్లు చెప్పారు.
Similar News
News September 15, 2025
శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా పోలీసుల వాహన తనిఖీలు

శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాలతో సోమవారం సాయంత్రం పోలీసులు జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు నిర్వహించి ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించగా హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి అని అవగాహన కల్పిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్‌లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
News September 15, 2025
BREAKING: కాలేజీలతో చర్చలు సఫలం

TG: కాలేజీల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో రేపటి నుంచి కాలేజీలు యథావిధిగా నడవనున్నాయి. ప్రస్తుతం రూ.600కోట్ల బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీపావళికి మరో రూ.600కోట్లు రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బంద్‌ను విరమించుకున్నాయి.
News September 15, 2025
ఆసిఫాబాద్: వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

ఆసిఫాబాద్ మండలం, బనార్వాడకు చెందిన చిచోల్కార్ సుధాకర్ (66) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. ఈనెల 2న తన టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయలుదేరిన సుధాకర్, సాయంత్రమైనా తిరిగి రాలేదు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.