News April 12, 2025
డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషిచేయాలి: కలెక్టర్

మత్తు పదార్థాల నిర్మూలనకై ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని సమాజానికి తోడ్పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, SP నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం వికారాబాద్ కలెక్టరేటలో ఎక్సైజ్, విద్యాశాఖ, జిల్లా సంక్షేమ, వ్యవసాయ, పోలీస్, వివిధ శాఖల అధికారులతో మాదకద్రవ్య నిర్మూలనపై సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కలిసి పనిచేయాలన్నారు.
Similar News
News January 16, 2026
నల్గొండ జిల్లాలో టుడే టాప్ న్యూస్

⏵నల్గొండ: లింకులను క్లిక్ చేస్తే బుక్ అయినట్లే: డీఎస్పీ
⏵నార్కట్ పల్లి: బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న చెరువుగట్టు
⏵నల్గొండ: వర్గపోరుతో ఎవరికి లాభం చేకూరేనో..
⏵నల్గొండలో ఇక నవశకం
⏵కేతేపల్లి: ఐదు రోజుల్లో 3 లక్షలకు పైగా వెహికల్స్ పాస్
⏵చండూర్: పండుగ పూట తాగునీటి కష్టాలు
⏵చిట్యాల: 53 వానరాల బందీ
⏵నల్గొండ: జిల్లాలో ఫార్మసీ రిజిస్ట్రీ అంతంతే
⏵నల్గొండ ఆసుపత్రిలో ఇదీ పరిస్థితి
News January 16, 2026
వేములవాడకు చేరుకున్న రాష్ట్ర మంత్రి సీతక్క

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వేములవాడకు చేరుకున్నారు. వేములవాడకు చేరుకున్న మంత్రి సీతక్కకు వేములవాడ ఆర్డీవో రాధాబాయి, ఆలయ ఈవో రమాదేవి, వేములవాడ ఏఎస్పీ రిత్విక్ సాయి ఘనంగా స్వాగతం పలికారు. రేపు శుక్రవారం ఉదయం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
News January 16, 2026
కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరలో ఉద్రిక్తత!

భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్యూలైన్‌లో ఇద్దరు భక్తుల మధ్య తోపులాట జరిగింది. దీంతో అడ్డుకోబోయిన పోలీసులపై యువకుడు దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. పోలీసులు, భక్తుల మధ్య వాగ్వాదం జరగడంతో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


