News April 12, 2025

నేడు ‘అర్జున్ S/O వైజయంతి’ ట్రైలర్

image

కళ్యాణ్ రామ్ లేటెస్ట్ సినిమా ‘అర్జున్ S/O వైజయంతి’ ట్రైలర్ నేడు విడుదల కానుంది. ఈరోజు రాత్రి 7.59 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయశాంతి చాలాకాలం తర్వాత మళ్లీ పోలీస్ పాత్రలో కనిపించడం, పోరాటాలు చేయడం విశేషం. తల్లీకొడుకుల భావోద్వేగాలు ప్రధాన ఇతివృత్తంగా సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

Similar News

News April 19, 2025

బంగ్లాదేశ్‌లో హిందు నేత హత్యను ఖండించిన భారత్

image

బంగ్లాదేశ్‌లో హిందూ నాయకుడు భాబేశ్ చంద్ర రాయ్ హత్య పట్ల భారత్ స్పందించింది. యూనుస్ ప్రభుత్వంలో మైనార్టీ హిందువులపై దాడులు క్రమ పద్ధతిన జరుగుతున్నాయని విదేశాంగ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ మండిపడ్డారు. మైనార్టీలపై దాడులు చేసిన వారిని శిక్షించలేదని ట్వీట్ చేశారు. దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా గుర్తు తెలియని వ్యక్తులు భాబేశ్‌ను కిడ్నాప్ చేసి కొట్టి చంపారు.

News April 19, 2025

లిక్కర్ స్కాం కేసు.. ఆడియో విడుదల చేసిన రాజశేఖర్ రెడ్డి

image

AP లిక్కర్ స్కాం కేసులో పరారీలో ఉన్న నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఓ ఆడియో విడుదల చేశారు. ‘MARలో సిట్ అధికారులు మా ఇంటికి వచ్చారు. మా అమ్మకు నోటీసులు ఇచ్చివెళ్లారు. 24 గంటల్లోనే నేను స్పందించి ఎందుకు పిలిచారని అధికారులను అడిగా. అయినా రెండోసారి మెయిల్‌కు నోటీసులు పంపారు. దీంతో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశా. విచారణకు సహకరిస్తా’ అని చెప్పారు. ఇదే కేసులో VSR నిన్న విచారణకు హాజరయ్యారు.

News April 19, 2025

ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం!

image

ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లాస్ ఏంజెలిస్‌లో జరిగే 2028 ఒలింపిక్స్‌లో స్కాట్లాండ్‌తో కలిసి బరిలోకి దిగనుందని సమాచారం. రెండు జట్లు కలిపి గ్రేట్ బ్రిటన్‌గా పాల్గొంటాయని క్రీడావర్గాలు తెలిపాయి. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ మ్యాచులకు మొదటి ఆరు ర్యాంకుల్లో ఉన్న జట్లకు ఎంట్రీ కల్పిస్తారు.

error: Content is protected !!