News April 12, 2025
వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: వెంకటరమణ

భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు వహించాలని వికారాబాద్ జిల్లా వైద్యాధికారి వెంకటరమణ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లోని జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎండ తీవ్రత ఉన్న సమయాల్లో బయటకు రావద్దని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
Similar News
News July 6, 2025
శంషాబాద్: రేపు పోస్ట్ ఆఫీస్ సేవలు నిలిపివేత

పోస్ట్ ఆఫీస్ సేవలను సోమవారం నిలిపివేస్తున్నట్లు సౌత్ ఈస్ట్ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ హైమావతి తెలిపారు. వినియోగదారులకు మరింత వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందించేందుకు తపాలా శాఖ పోస్టల్ టెక్నాలజీ ఐటీ 2.0ను ప్రవేశ పెడుతుంది. ఈనెల 8 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని, ఇందులో భాగంగా రేపు పోస్టాఫీసుల్లో ఎలాంటి లావాదేవీలు జరగవని పేర్కొన్నారు.
News July 6, 2025
అనకాపల్లి: నేడు ఉచితంగా రేబిస్ వ్యాక్సినేషన్

ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబిస్ వ్యాక్సిన్ వేయనున్నట్లు ఆయన జిల్లా పశువైద్యాధికారి రామ్మోహన్ రావు శనివారం తెలిపారు. అనకాపల్లి గాంధీ ఆసుపత్రిలో మాట్లాడుతూ.. స్థానిక జిల్లా ఆసుపత్రితో పాటు అన్ని మండలాల్లో గల పశువైద్య కేంద్రాల్లో రేబిస్ వ్యాక్సిన్ వేస్తారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
News July 6, 2025
‘అన్నదాత సుఖీభవ’ అనర్హులకు అలర్ట్

AP: ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి అర్హత సాధించని రైతులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. మొదటి దశ పరిశీలన, రెండోదశ ధ్రువీకరణలో అర్హత సాధించలేకపోయిన రైతుల రికార్డులను కంప్లైంట్ మాడ్యూల్‌లో పొందుపరిచారు. అనర్హులుగా ఉన్న రైతులు ఫిర్యాదు చేసేందుకు ముందు రైతు సేవాకేంద్రంలోని సిబ్బందిని కలవాలని అధికారులు తెలిపారు. ఈనెల 10లోపు ఫిర్యాదుల స్వీకరణ ముగించాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ సూచించారు.