News April 12, 2025

ఖానాపూర్: లయన్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక

image

లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఖానాపూర్‌ అన్నదాత నూతన అధ్యక్షుడిగా సాదుల వెంకటస్వామి మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా రాచమల్ల రాజశేఖర్, కోశాధికారిగా పి.రాంచందర్‌ ఎన్నికయ్యారు. శుక్రవారం లయన్స్‌ ఇంటర్నేషనల్‌ జిల్లా 320డి అదనపు క్యాబినేట్‌ సెక్రటరీ ఎం.రాజన్న హాజరై 2025–26 సంవత్సరానికి ఎన్నికలు నిర్వహించారు.

Similar News

News November 11, 2025

ఏపీలో నేడు..

image

▶ గుంటూరులో జరుగుతున్న వాటర్ షెడ్ మహోత్సవ్‌లో పాల్గొననున్న కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. అనంతరం CM చంద్రబాబుతో భేటీ
▶ అమరావతిలో దసపల్లా 4 స్టార్ హోటల్ నిర్మాణానికి భూమిపూజ
▶ శ్రీకాకుళంలో ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్న సిక్కోలు పుస్తక మహోత్సవం, 10 రోజులు కొనసాగింపు

News November 11, 2025

2700 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తులు

image

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) 2,700 అప్రెంటిస్ పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ ఉత్తీర్ణులైనవారు DEC 1వరకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం అప్రెంటిస్‌లలో TGలో 154, APలో 38 ఉన్నాయి. NATS లేదా NAPS పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్‌లైన్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News November 11, 2025

కర్రపెండలంలో జింక్ లోప లక్షణాలు – నివారణ

image

కర్రపెండలంలో మొక్కలో జింక్ లోపం వల్ల ఆకులు సన్నగా, పసుపుగా మారి పైకి వంకరగా ఉంటాయి. పెరుగుతున్న లేత మొక్క భాగంపై ప్రభావం ఎక్కువగా ఉండి, పెరుగుదల తగ్గుతుంది. లేత ఆకులలో ఈనెల ముఖ్య భాగం పసుపు రంగులోకి మారుతుంది. లోప నివారణకు 5KGల జింక్ సల్ఫేట్ భూమిలో వేసి కప్పాలి. 1-2% జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని 3-4 సార్లు పిచికారీ చేయాలి. ముచ్చెలను 2-4% జింక్ సల్ఫేట్ ద్రావణంలో 15 నిమిషాలు ముంచిన తర్వాత నాటుకోవాలి.