News April 12, 2025
గూగుల్‌లో భారీగా కొలువుల కోత

గూగుల్ మరోసారి కొలువుల తొలగింపు ప్రారంభించింది. వందలాదిమందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తోంది. ప్రధానంగా ఆండ్రాయిడ్, పిక్సెల్ ఫోన్, క్రోమ్ బ్రౌజర్లలో పనిచేసే టెకీలపై వేటు వేసింది. చివరిగా 2023లోనూ 12వేలమందిని ఆ సంస్థ తొలగించిన సంగతి తెలిసిందే. ఆంక్షల యుద్ధాల నడుమ ప్రపంచ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో గూగుల్ బాటలోనే మరిన్ని సంస్థలు కొలువుల కోత బాట పట్టొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Similar News
News November 17, 2025
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు నోటీసులు

MLAల పార్టీ ఫిరాయింపు ఇతర పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారించింది. కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు MLAలపై 3నెలల గడువులో ఎందుకు చర్యలు తీసుకోలేదో వివరణ ఇవ్వాలని, 4 వారాల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే కేసును పాస్ ఓవర్ చేయాలని ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. దీంతో సుప్రీంకోర్టు పాస్ ఓవర్ చేసింది. ఈరోజు సాయంత్రం కేసును విచారించే అవకాశం ఉంది.
News November 17, 2025
US నుంచి LPG దిగుమతి.. తగ్గనున్న ధరలు: హర్దీప్‌సింగ్

అమెరికా నుంచి LPGని దిగుమతి చేసుకునేందుకు కీలక ఒప్పందం కుదిరిందని కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ తెలిపారు. ‘ఏడాదిపాటు ఈ డీల్ అమల్లో ఉంటుంది. IND కంపెనీలు 2.2MTPA ఇంపోర్ట్ చేసుకుంటాయి. ఇది మొత్తం వార్షిక దిగుమతుల్లో 10 శాతానికి సమానం. ప్రజలకు మరింత తక్కువ ధరకు LPGని అందించడంలో ఇదొక ముందడుగు. ప్రస్తుతం సిలిండర్ ధర ₹1100 ఉన్నప్పటికీ ₹500-550కే అందిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News November 17, 2025
మాట్లాడుకుంటేనే సమస్యలకు పరిష్కారం

భార్యాభర్తల ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి. కొన్నిసార్లు అహం, ఇంకొన్నిసార్లు అపార్థాలు పలకరిస్తాయి. అలకలూ ఉంటాయి. వాటిని దాటితేనే బంధం పదిలంగా మారుతుంది. అభిప్రాయ భేదాలు వచ్చి అలిగినా తెగేదాకా లాగొద్దు. పరోక్ష వ్యాఖ్యానాలు చేయొద్దు. నేరుగానే పరిష్కరించుకోండి. సమస్య ఏదైనా ఎదుటివారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. లేదంటే సమస్య పరిష్కారం కాకపోగా అవతలివారిలో రోజు రోజుకీ అసంతృప్తి పెరిగిపోతుంది.


