News April 12, 2025

సిరిసిల్ల: ఈనెల 21 లోపు దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

image

ఈనెల 21 లోపు ముంపు గ్రామాల ప్రజలు ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మిడ్‌మానేరు ముంపు గ్రామాల ప్రజలు ఈనెల 11 నుంచి 21 వరకు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

Similar News

News April 19, 2025

వెల్దుర్తి: పేడ రంగు నీళ్లు తాగి వివాహిత మృతి

image

వెల్దుర్తి మండలం యల్.కొట్టాలలో విషాదం నెలకొంది. సుహాసిని అనే వివాహిత ఇంట్లో ఎవరు లేని సమయంలో పేడరంగు నీళ్లు తాగి ఇద్దరు పిల్లలతో సహా శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు హుటాహుటిగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఇద్దరు పిల్లలు మాన్యశ్రీ (10), విలక్షణ (7) పరిస్థితి విషమంగా ఉంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News April 19, 2025

చీపురు పట్టిన హోంమంత్రి అనిత

image

గుంటూరు పోలీస్ కార్యాలయం ఆవరణలో హోంమంత్రి వంగలపూడి అనిత చీపురు పట్టి చెత్తను తొలగించి శుభ్రం చేశారు. శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి మంత్రి శ్రమదానం నిర్వహించినట్లు ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని హరిత ఆంధ్ర ప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

News April 19, 2025

లిక్కర్ స్కాం కేసు.. ఆడియో విడుదల చేసిన రాజశేఖర్ రెడ్డి

image

AP లిక్కర్ స్కాం కేసులో పరారీలో ఉన్న నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఓ ఆడియో విడుదల చేశారు. ‘MARలో సిట్ అధికారులు మా ఇంటికి వచ్చారు. మా అమ్మకు నోటీసులు ఇచ్చివెళ్లారు. 24 గంటల్లోనే నేను స్పందించి ఎందుకు పిలిచారని అధికారులను అడిగా. అయినా రెండోసారి మెయిల్‌కు నోటీసులు పంపారు. దీంతో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశా. విచారణకు సహకరిస్తా’ అని చెప్పారు. ఇదే కేసులో VSR నిన్న విచారణకు హాజరయ్యారు.

error: Content is protected !!