News April 12, 2025
‘సరస్వతి పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించాలి’

సరస్వతి పుష్కరాలను సమన్వయంతో, అన్ని విభాగాల అధికారులు టీమ్‌వర్క్‌తో విజయవంతంగా నిర్వహించాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అన్నారు. శుక్రవారం దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, పర్యాటక శాఖ ఎండీ ప్రకాష్ రెడ్డిలతో కలిసి భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, ఇతర శాఖల అధికారులతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
Similar News
News September 18, 2025
డీఎస్సీ అభ్యర్థులకు 134 బస్సులు: డీఈవో

రేపు అమరావతిలో మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రాలు అందజేయనున్నారని డీఈవో శామ్యూల్ తెలిపారు. వారిని అమరావతికి తీసుకెళ్లేందుకు 134 బస్సులను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,590 మంది అభ్యర్థులు ఉపాధ్యాయ కొలువులు సాధించారని అన్నారు. రాయలసీమ విశ్వవిద్యాలయం నుంచి ఉదయం 10 గంటలకు బస్సులు బయలుదేరుతాయని, అభ్యర్థులు ఉ.7 గంటల్లోపు అక్కడికి చేరుకోవాలని తెలిపారు.
News September 18, 2025
మెగా డీఎస్సీ అభ్యర్థులకు నేడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ

మెగా డీఎస్సీ నియామక పత్రాలు జారీ ప్రక్రియ 19వ తేదీన అమరావతిలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు డీఈవో వాసుదేవరావు బుధవారం తెలిపారు. టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులందరూ 18వ తేదీన ఒక సహాయకునితో రాజమండ్రిలో కేటాయించిన పాఠశాలలకు రెండు పాస్ పోర్ట్ ఫోటోలు, ఆధార్ కాల్ లెటర్‌తో సాయంత్రం 4 గంటలకు హాజరు కావాలని సూచించారు. అభ్యర్థుల రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, బస్సుల్లో విజయవాడ పంపుతామన్నారు.
News September 18, 2025
SKLM: ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

శ్రీకాకుళం ప్రభుత్వ డీఎల్టీసీ, ఐటీఐలో ప్రవేశాలకు 27వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని అసిస్టెంట్ డైరెక్టర్ మోహనరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు మిగిలిన సీట్లకు నాలుగో విడత కౌన్సెలింగ్ జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం, 28న సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. 29 న కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.