News April 12, 2025

శ్రీశైలంలో నేడు గిరి ప్రదక్షిణ కార్యక్రమం

image

పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం క్షేత్రంలో శనివారం గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో ఎం. శ్రీనివాసరావు తెలిపారు. స్వామి, అమ్మవారికి మహా మంగళ హారతుల పూజల అనంతరం ఆలయ మహాద్వారం నుంచి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు అందరికీ ప్రదక్షిణ అనంతరం స్వామి, అమ్మవారి దర్శనం కల్పిస్తామన్నారు.

Similar News

News March 22, 2026

నంద్యాల కలెక్టరేట్‌లో రేపు పీజీఆర్ఎస్

image

నంద్యాల కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లీనిక్ కార్యక్రమాలు జరుగుతాయని కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా అర్జీలు సమర్పించవచ్చని, సమర్పించిన దరఖాస్తుల స్థితిని 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే మీకోసం వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు చేసే సదుపాయం ఉందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

News March 22, 2026

అనకాపల్లి: రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు

image

అనకాపల్లి జిల్లాలో ఈనెల 23వ తేదీన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు కేంద్ర మంత్రులు వస్తున్న నేపథ్యంలో అధికారులు పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు తెలిపారు. ఈ కారణంగా వీటిని రద్దు చేస్తున్నామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

News March 22, 2026

జిల్లాలో గ్యాస్ కొరత లేదు: జేసీ

image

ఏలూరు జడ్పీ సర్వసభ్య సమావేశంలో జేసీ అభిషేక్ గౌడ్ పాల్గొని జిల్లాలో వంటగ్యాస్ సరఫరాపై కీలక ప్రకటన చేశారు. గృహ వినియోగదారులకు గ్యాస్ కొరత లేదని, పైప్‌లైన్ ద్వారా సరఫరాను మరింత విస్తరిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న 5 వేల కనెక్షన్లను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ పాఠశాలలు, వాణిజ్య విభాగాలకు కూడా అంతరాయం లేకుండా గ్యాస్ అందుబాటులో ఉంచుతామని ఆయన వెల్లడించారు.